బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య.. క్షమించు కన్నా అంటూ పేరెంట్స్‌ ఆవేదన

13 Oct, 2022 09:40 IST|Sakshi

తిరుమల: చదువులో వెనకబడ్డాడని తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగు చూసింది. వివరాలు.. ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం గిద్దలూరు, కాలవపల్లికి చెందిన ఎం.బసిరెడ్డి కుమారుడు ఎం.నాగేశ్వర్‌రెడ్డి (21) చెన్నైలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ సీఎస్‌ఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చదువులో వెనకబడడంతో తల్లిదండ్రులు మందలించారు.

దీంతో మనస్తాపా నికి గురైన యువకుడు అలిపిరి మెట్లమార్గం గాలిగోపురానికి సమీపంలోని అటవీప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవా రం సాయంత్రం గుర్తించిన స్థానికులు తిరుమల టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న టూటౌన్‌ ఎస్‌ఐ సాయినాథ్‌ చౌదరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సెల్‌ నుంచి కుటుంబ సభ్యులకు సమాచా రం అందజేసి బుధవారం మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు