ఆదిలోనే అధిక ఉష్ణోగ్రతలు

25 Feb, 2023 04:48 IST|Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుదల

సాక్షి, అమరావతి: వేసవి ప్రారంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ప్రతాపం చూపుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 36 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లిలో అత్యధికంగా 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో 37 నుంచి 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో 36–38 డిగ్రీల ఉష్ణోగ్రతలొచ్చాయి. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రానున్న నాలుగైదు రోజుల్లో ఎండల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో 3– 5, రాయలసీమలో 2–3 డిగ్రీల మేర సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతా­యని పేర్కొంది. పొడి గాలుల కారణంగా ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది.  

మరిన్ని వార్తలు