సీఎం జగన్‌ విజన్‌కు అనుగుణంగా పనిచేయాలి: సజ్జల

6 Sep, 2021 15:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర సాంఘిక సంక్షేమ మండలి చైర్మన్‌గా పులి సునీల్‌ కుమార్‌ సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఎంపీలు అవినాష్‌ రెడ్డి, నందిగం సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ప్రభుత్వ విప్ వెన్నపూస వేణుగోపాల్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ...''వైఎస్‌ జగన్‌ ఆశయాలకు, విజన్‌కు అనుగుణంగా కార్పొరేషన్ ఛైర్మన్లు పనిచేయాలి. అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పులోనూ సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ సామాజిక న్యాయం పాటించారు. అట్టడుగు వర్గాల ప్రజలు తమ కాళ్ళమీద తాము నిలబడేలా చేస్తున్నారు. 

దళితులకు న్యాయం చేసేందుకు దళితుల నుంచే నాయకులను తయారు చేస్తున్నారు. గతంలో పైరవీలు చేసినవారికి, డబ్బులు ఇచ్చిన వారికి పదవులు వచ్చాయి. కానీ జగన్ కష్టపడినవారిని గుర్తించి పదవులు ఇస్తున్నారు. అతి తక్కువ జనాభా ఉన్న కులాలను గుర్తించి వారికి పదవులు ఇస్తూ ఔన్నత్యాన్ని కాపాడుతున్నారు. కొంతమందికి న్యాయం చేయలేకపోయామనేది వాస్తవం. కచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది.'' అని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు