పవన్‌ బహుజనుల పక్షమో, ప్యాకేజీ పక్షమో తేల్చుకోవాలి

19 Nov, 2020 04:04 IST|Sakshi
మాట్లాడుతున్న సోషల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు మాదిగాని గురునాథం

సోషల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ డిమాండ్‌ 

50వ రోజుకు చేరిన మూడు రాజధానుల మద్దతు దీక్షలు 

తాడికొండ:  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బహుజనుల పక్షమో.. ప్యాకేజీ పక్షమో తేల్చుకోవాలని సోషల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 50వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గురునాథం మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్‌గా మారి.. అమరావతి జేఏసీ కోసం జోలె పడతామనడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు.

హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న బహుజన పరిరక్షణ సమితి దీక్షలకు మద్దతు ఇవ్వకుండా తప్పుడు ప్రచారం చేస్తే జనసేన అధినేత పవన్‌కల్యాణ్, వామపక్షాల నేతలు, చంద్రబాబు ఇళ్లను ముట్టడించడం ఖాయమన్నారు. దీక్షలకు ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన దళిత సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ దిష్టిబొమ్మకు జోలెకట్టి అందులో పావలా నాణేలు వేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు, నవ్యాంధ్ర ఎమ్మారీ్పఎస్‌ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, పీవీ రావు మాల మహానాడు అధ్యక్షుడు నత్తా యోనరాజు, దళిత వర్గాల సమాఖ్య అధ్యక్షుడు చెట్టే రాజు, దళిత సంఘాల నాయకులు మేదర సురేష్, బొండపల్లి గిరిజ, బండి పుణ్యశీల, కాలే పుల్లారావు, బూదాల శ్రీనివాస్, మధిర ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు