టీడీపీ నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

9 Feb, 2021 12:03 IST|Sakshi

భూ కుంభకోణంపై సిట్ ఏర్పాటు, దమ్మాలపాటి కేసుపై సుప్రీం కోర్టులో విచారణ

రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

సాక్షి, ఢిల్లీ: అమరావతి భూ కుంభకోణంపై సిట్ ఏర్పాటు, మాజీ ఏజీ దమ్మాలపాటి  కేసుపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. నోటీసులకు టీడీపీ నేతలు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ఆఖరి అవకాశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేదంటే తాము ప్రొసీడ్ అవుతామని హెచ్చరించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రలను సుప్రీంకోర్టు ఆదేశించింది. రీ జాయిండర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మార్చి 5న తుది విచారణ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది.

కాగా, అమరావతి భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీ పరిశీలన మేరకు ఏర్పాటైన సిట్‌ దర్యాప్తును నిలిపివేయాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తదితరులు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 
(చదవండి: వివరాలు లేకుండా పిల్‌ ఎలా వేస్తారు?)
సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోండి

మరిన్ని వార్తలు