ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు

25 Jun, 2021 15:14 IST|Sakshi

ఢిల్లీ: రాష్ట్రంలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశంసించింది. సీబీఎస్‌ఈ పరీక్షల రద్దు అంశంపై  విచారణ సందర్భంగా.. ఏపీ పరీక్షల రద్దు విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాది దుశ్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా న్యాయవాది దవే మాట్లాడుతూ..''ఎన్నికల ర్యాలీలు, సభలు జరిగాయని సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. గురువారం సుప్రీం విచారణ అనంతరం ముఖ్యమంత్రి వెంటనే పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణకు సిద్ధమైనప్పటికి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేశాము.  పది రోజుల్లో హైపవర్ కమిటీ అసెస్‌మెంట్ స్కీమ్‌ను రూపొందించి జూలై 31 లోపు ఫలితాలను ప్రకటిస్తుంది. దేశం మొత్తం ఒక వైపు ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక మార్గంలో వెళ్ళలనుకోవడం లేదని తాము భావించాము.. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కుంభ మేళాలో జరిగిన దానికి ఎవరూ బాధ్యత తీసుకోలేదంటూ'' ఆయన తెలిపారు.

చదవండి: ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు