మార్గదర్శి కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ చేయండి

6 Jun, 2023 09:05 IST|Sakshi

సుప్రీం కోర్టును కోరిన ఏపీ ప్రభుత్వం 

ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం 

సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నిధుల దారి మళ్లింపు కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ రాజేష్‌ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. 
మార్గదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌ సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వి, సిద్దార్ధ లూత్రాలు వాదనలు వినిపిస్తూ.. సీఆర్‌పీసీ సెక్షన్‌ 406 కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌ చెల్లదని తెలిపారు.

ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌ స్పందిస్తూ.. తాము సీఆర్‌పీసీ సెక్షన్‌ 406 రెడ్‌ విత్‌ 139 ఏ కింద పిటిషన్‌ దాఖలు చేశామని తెలిపారు. ఆర్టికల్‌ 139 ఏ కింద ఒక హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను మరో హైకోర్టుకు బదిలీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉందని వివరించారు. ఈ అంశంపై ఎగ్జామిన్‌ చేస్తామన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ జులై 18కి వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇతరత్రా అంశాలను తదుపరి విచారణలో పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. 

చదవండి: Odisha Train Accident: ఒక్కరు తప్ప అందరూ సేఫ్‌

మరిన్ని వార్తలు