రేపే సుప్రీంకోర్టు ముందుకు అవినాష్ రెడ్డి మ్యాటర్

22 May, 2023 19:29 IST|Sakshi

జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ బెంచ్ ముందుకు పిటిషన్

ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. 

సంఖ్య విషయం సంబంధిత సమాచారం
1 డైరీ నెంబర్‌ 20416/2023
2 కేసు నెంబర్‌ MA 00 1285
3 విచారణ తేదీ 23 మే 2023
4 CL నెంబర్‌ 36
5 కేటగిరీ క్రిమినల్‌ మ్యాటర్స్‌
6 సబ్జెక్ట్‌  బెయిల్‌ 
7 బెంచ్‌ 1. జస్టిస్‌ J.K.మహేశ్వరీ
2. జస్టిస్‌ పమిడిగంఠం శ్రీ నరసింహా
8 పిటిషనర్‌ సునీత నర్రెడ్డి
9 రెస్పాండెంట్స్‌ 1. Y.S.అవినాష్‌ రెడ్డి
2. డైరెక్టర్‌, CBI
10 సునీత తరపు న్యాయవాది జెసల్‌ వాహి
11 అవినాష్‌ తరపు న్యాయవాది

ముకుంద్‌ P.ఉన్నీ

ఈ పిటిషన్ ను సునీత నర్రెడ్డి గతంలో దాఖలు చేశారు. మరో వైపు ఇదే వ్యవహారంపై అవినాష్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ విచారించేలా హైకోర్టు వెకేషన్ బెంచ్‌ను ఆదేశించాలని విజ్ఙప్తి చేశారు. తల్లి అనారోగ్యం వల్ల వారంపాటు సిబిఐ విచారణకు రాలేనని, సిబిఐ విచారణకు హాజరుపై మినహాయింపు కావాలని కోరారు.

తన తల్లికి చికిత్స జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. ఇదే విషయాన్ని సిబిఐకి కూడా లిఖిత పూర్వకంగా తెలిపారు.

(చదవండి : అమ్మ పరిస్థితి సీరియస్‌, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి)

మరిన్ని వార్తలు