సుప్రీంకోర్టులో ఏబీఎన్‌ ఛానల్‌కు చుక్కెదురు

31 May, 2021 14:07 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏబీఎన్‌ ఛానల్‌కు చుక్కెదురయ్యింది. ఏబీఎన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఏపీ సీఐడీ పెట్టిన కేసు దర్యాప్తుపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. రఘురామకృష్ణరాజుతో పాటు ఏబీఎన్‌, టీవీ5పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ ఏబీఎన్‌ సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఏబీఎన్‌పై కేసును సీఐడీ దర్యాప్తు చేసుకోవచ్చని.. దర్యాప్తు పూర్తయ్యేవరకు తీవ్ర చర్యలు వద్దని పేర్కొంది. విచారణను ఆరు వారాలకు కోర్టు వాయిదా వేసింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలా? వద్దా? అన్నది అప్పుడు విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

చదవండి: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ 
ఏపీలో జూన్‌ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు 

>
మరిన్ని వార్తలు