మాజీ ఏజీ దమ్మాలపాటి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

13 Jul, 2021 13:02 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్‌ ధావన్ తన వాదనలు వినిపించారు. దర్యాప్తును సీబీఐ లేదా రిటైర్డ్ జడ్జి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసును లోతైన విచారణ జరిపేందుకు హైకోర్టుకు పంపాలని రాజీవ్ ధావన్ కోరారు. వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు