-

సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్‌ రద్దు కేసు డిసెంబర్‌ 8కి వాయిదా

28 Nov, 2023 15:10 IST|Sakshi

చంద్రబాబు కేసు డిసెంబర్‌ 8కి వాయిదా

క్వాష్‌ పిటిషన్‌పై తుది తీర్పు వచ్చిన తర్వాత బెయిల్‌ రద్దు అంశం పరిశీలన

ఉత్కంఠ రేపుతోన్న 17a సెక్షన్‌పై  సుప్రీంకోర్టు తుది తీర్పు

వచ్చే నెల మొదటి వారంలోగా క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వచ్చే అవకాశం

లేదంటే రాజ్యాంగ ధర్మాసనానికి 17a సెక్షన్‌ సమీక్ష లేదా విచారణ

న్యూఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిసెంబర్‌ 8కి వాయిదా వేసింది. బాబు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనం విచారించింది. ప్రాథమిక వాదనల అనంతరం కేసును వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలు

  • డిసెంబర్‌ 8వ తేదీకి విచారణ వాయిదా
  • బెయిల్‌ కండిషన్లు అన్నీ యథాతధం
  • స్కిల్‌ కుంభకోణం కేసు గురించి చంద్రబాబు ప్రకటనలు చేయొద్దు
  • కేసు వివరాలపై బహిరంగంగా ప్రకటనలు చేయొద్దు
  • కేసుకు సంబంధించిన విషయాలు మీడియాలో మాట్లాడొద్దన్న షరతును గతంలో తొలగించిన హై కోర్ట్
  • హైకోర్టు తొలగించిన షరతును తిరిగి చంద్రబాబుకు విధించిన సుప్రీంకోర్టు
  • ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ కార్యకలపాల్లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి

తదుపరి విచారణ వరకు ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. డిసెంబర్‌ 8లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

కాగా స్కిల్‌ స్కాం కేసులో ఇటీవల బాబుకు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది .అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ సీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు బాబుపై పలు ఆంక్షలు విధించింది.

సెక్షన్‌ 17aతో ముడిపడిన చంద్రబాబు భవితవ్యం
వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. చంద్రబాబు కేసులన్నీ సెక్షన్‌ 17a తో ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ కాగానే సెక్షన్‌ 17a రాగం అందుకున్నారు. తప్పు చేయలేదని చెప్పకుండా.. అరెస్ట్‌ చేయాలంటే గవర్నర్‌ అనుమతి తీసుకోవాలంటూ మెలిక పెట్టారు. నేరం జరిగింది, దర్యాప్తు మొదలయింది 17a కంటే ముందే అని చెప్పిన వినిపించుకోకుండా.. హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు లాయర్లు ఇవే వాదనలు వినిపించారు. గత నెలలో సుప్రీంకోర్టులోనూ సెక్షన్‌ 17aపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. CID తరపున ముకుల్‌ రోహత్గీ, చంద్రబాబు తరపున హరీష్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వేర్వేరు కేసుల్లో సెక్షన్‌ 17aకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉదహరించాయి ఇరు పక్షాలు. మొత్తమ్మీద ఈ కేసులో కీలకమైన సెక్షన్‌ 17a, దాని చుట్టూ ఇరుపక్షాలు చేస్తున్న వాదనలను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉందంటున్నారు రాజ్యాంగ నిపుణులు.

చదవండి: గత రెండు నెలలుగా గాడి తప్పిన తెలుగుదేశం

మరిన్ని వార్తలు