తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షలకు అనుమతి: సుప్రీంకోర్టు

22 Jun, 2021 18:53 IST|Sakshi

ఢిల్లీ: సీబీఎస్‌ఈ పరీక్షల రద్దు అంశంలో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల రద్దు అంశంపై ఏపీ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు అడిగింది. ఏపీ తరపు న్యాయవాది పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. కాగా విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు అడిగింది. పరీక్ష హాల్లో కేవలం 15 నుంచి 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.

విద్యార్థుల మధ్య కనీసం 5 అడుగుల భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పదోతరగతి విద్యార్థులకు గ్రేడ్లు మాత్రమే ఇస్తున్నామని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షలకు అనుమతి ఇస్తామని సుప్రీంకోర్టు ఆ సందర్భంగా స్పష్టం చేసింది. కోర్టుకు తెలిపిన అంశాలను రేపు అఫిడవిట్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కేసు విచారణను సుప్రీంకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
చదవండి: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చ

మరిన్ని వార్తలు