Kundurpi: తహసీల్దార్‌ సస్పెన్షన్‌.. కుందుర్పి దాటి వెళ్లొద్దు

1 Sep, 2022 08:23 IST|Sakshi
తహసీల్దారు తిప్పేస్వామి  

ఆత్మకూరులో పనిచేసినప్పుడు భూ అక్రమాలు 

గతంలో కూడేరు తహసీల్దారుపై చర్యలు 

సాక్షి, అనంతపురం అర్బన్‌: ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలను జగన్‌ సర్కార్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందుకు అనుగుణంగా కలెక్టర్‌ నాగలక్ష్మి చర్యలు చేపట్టారు. అవకతవకలు, అక్రమాలపై విచారణ చేయించడమే కాక, తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే వెంటనే చర్యలు చేపడుతున్నారు.  ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కూడేరు తహసీల్దారు శ్రీనివాసులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా కుందుర్పి తహసీల్దారు తిప్పేస్వామిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా కుందుర్పి విడిచి వెళ్లకూడదని ఆదేశాలిచ్చారు. ఇక కుందుర్పి తహసీల్దారుగా అదనపు బాధ్యతలను బ్రహ్మసముద్రం తహసీల్దారు    బాలకిషన్‌కు అప్పగించారు.

అత్మకూరులో ఉండగా అవినీతి 
కుందుర్పి తహసీల్దారు తిప్పేస్వామి గతంలో ఆత్మకూరు తహసీల్దారుగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో గొరిదిండ్ల, సనప, ఆత్మకూరు, మదిగుబ్బ, పి.యాలేరు. బి.యాలేరు రెవెన్యూ గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్పందించిన కలెక్టర్‌ సంబంధిత ఆర్‌డీఓ ద్వారా విచారణ జరిపించారు. వెబ్‌ల్యాండ్‌లో అవకతవకలకు పాల్పడి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. 

అవకతవకలు నిర్ధారిస్తూ ఆర్‌డీఓ ఇచ్చిన నివేదిక  
►గొరిదిండ్ల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 5–6లో 5.17 ఎకరాలు అన్‌సెటిల్డ్‌ భూమికి (ఖాతా నెంబరు 1000010) వెబ్‌ల్యాండ్‌లో రేనాటి వరలక్ష్మి పేరును పట్టాదారుగా మార్చారు. 788–3 సర్వే నెంబరులో 4.90 ఎకరాలు అన్‌సెటిల్డ్‌ భూమి (ఖాతా నెంబరు 1000010) డి.భీమానాయక్‌ పేరును పట్టాదారుగా మార్చారు. సర్వే నెంబరు 604–3లో నాగలక్ష్మికి చెందిన 2.85 ఎకరాలు భూమిని కొలిమి సల్మా అనే మహిళను పట్టాదారుగా మార్చారు. సర్వే నెంబరు 1122–1లో ఎలమకూరి తనుజాకు చెందిన 4.98 ఎకరాలను డి.గీంతాజలి పేరున మార్చారు. 
►సనప రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 282–11లో చిన్నప్పకు చెందిన 4.15 ఎకరాల భూమిని పి.వై.ఎల్లప్ప పేరున మార్చారు. 
►ఆత్మకూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 373లో హరిజన మంత్రి ముత్యాలప్పకు చెందిన 0.50 ఎకరాల భూమిని వై.సుందరమ్మ పేరున మార్చారు. సర్వే నెంబరు 261–1లో ఎస్‌.నల్లమ్మకు చెందిన 3.42 ఎకరాల భూమిని లలితమ్మ పేరున పట్టా చేశారు. సర్వే నెంబరు 502–3లో అంకంపల్లి ఓబుళపతికి చెందిన 2.10 ఎకరాల భూమిని ఎ.సోమశేఖర్‌ పేరున మార్చారు. సర్వే నెంబరు 2–1లో బోడిపాటి నరసమ్మకు చెందిన ఐదు ఎకరాల భూమిని వెంటేసులు, బి.హరికుమార్‌ పేరున మార్చారు. సర్వే నెంబరు 122–బి1ఎ3లో ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన ఐదు ఎకరాలను ఎస్‌.నాగరత్నమ్మ పేరున మార్చారు. 
►మదిగుబ్బలో సర్వే నెంబరు 136–6లో 1.25 ఎకరాల మిగులు భూమిని సద్దల పెద్ద నారాయణ పేరున మార్చారు. సర్వే నెంబరు 35–5లో బండి అపర్ణమ్మకు చెందిన 3.85 ఎకరాలను బండి ముత్యాలమ్మ పేరున మార్చారు. సర్వే నెంబరు 143–5బిలో 0.80 ఎకరాలు (లేని భూమి) తలారి నరసింహులు పేరున మార్చారు. 
►పి.యాలేరులో సర్వే నెంబరు  403–1ఎలో మండల బొమ్మయ్యకు చెందిన ఐదు ఎకరాలను ఎం.మంజుల పేరున మార్చారు. సర్వే నెంబరు 181–1లో 2.50 ఎకరాల మిగులు భూమిని వై.సౌభాగ్య పేరున మార్చారు. సర్వే నెంబరు 58–1, 2లో ఎస్‌.దుబ్బరామయ్యకు చెందిన 0.98 ఎకరాలు, 0.96 ఎకరాల భూమిని సుగాలి బాబు పేరున మార్చారు. అదే సర్వే నెంబర్లలో దుబ్బరామయ్యకు చెందిన 0.97 ఎకరాలు, 0.96 ఎకరాల భూమిని సుగాలి లక్ష్మీనారాయణ పేరున మార్చారు. సర్వే నెంబరు 7–3లో జి.లక్ష్మన్నకు చెందిన 2.09 ఎకరాలను జి.శివారెడ్డి పేరున మార్చారు. సర్వే నెంబరు 453–6లో 4 ఎకరాల మిగులు భూమిని జె.మమత పేరున మార్చారు.  
►బి.యాలేరులో సర్వే నెంబరు 85–1లో అన్‌సెటిల్డ్‌ భూమిని ఎనుముల అఖిల పేరున మార్చారు. సర్వే నెంబరు 224–1ఎలోని 2.20 ఎకరాలను (లేని భూమి) టి.లక్ష్మిదేవి పేరున మార్చారు.  

మరిన్ని వార్తలు