అర్చకుల జీవితాల్లో సీఎం జగన్‌ వెలుగులు నింపారని ప్రశంస

20 May, 2021 14:16 IST|Sakshi

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌ కేటాయింపులపై స్పందించారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌లో రూ.120 కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. దశాబ్దాలుగా అర్చకుల వేతనాలపై గత పాలకులు పట్టించుకోలేదని పేర్కొన్నారు.

అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్‌ అభినందనీయులు అని స్వరూపానందేంద్ర స్వామి కొనియాడారు. సీఎం జగన్‌కు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని చెప్పారు. శాసనసభలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రెండు లక్షల 29 వేల కోట్ల బడ్జెట్‌ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. దీంతోపాటు బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.359 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ కేటాయింపులపై అర్చకులు, బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు