‘ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడింది’

30 Sep, 2020 14:11 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: బాబ్రీ మసీదు కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేయడంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్పందించారు. బాబ్రీ కేసును కొట్టేయడం సంతోషదాయకమన్నారు. ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడిందని హర్షం వ్యక్తం చేశారు. 28 ఏళ్ళ నిరీక్షణకు తెరపడటం ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ తీర్పుతో బాబ్రీ మసీదు వివాదానికి పూర్తిగా తెరపడిందని  అభిప్రాయపడ్డారు. కేసులో ఉన్నవారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రధాని నరేం‍ద్రమోదీ ప్రభుత్వానికి విశాఖ శారదా పీఠం తరపున అభినందనలు తెలియజేశారు. 

చదవండి: బాబ్రీ విధ్వంసం: నిందితులంతా నిర్దోషులే

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా