విగ్రహాల ధ్వంసం బాధాకరం: స్వాత్మానందేంద్ర సరస్వతి

3 Jan, 2021 19:58 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: బురుజు పేటలోని శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారిని  ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి శారదా పీఠం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాత్మానందేంద్ర మీడియాతో మాట్లాడుతూ, దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం బాధాకరమన్నారు. తొలిరోజుల నుంచీ హిందూ సంప్రదాయాలు, ఆలయ ఆస్తుల పరిరక్షణలో శారదాపీఠం పోరాటాలు సాగిస్తోందని తెలిపారు. మహాస్వామి స్వరూపానందేంద్ర సరస్వతి దేవాదాయశాఖ మంత్రితో చర్చించారని, ఆలయాల భద్రతపై త్వరలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో స్వరూపానందేంద్ర సరస్వతి సమావేశమవుతారని స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు.

మరిన్ని వార్తలు