కొవ్వలిలో వింత వ్యాధి లక్షణాలు..

26 Jan, 2021 15:35 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో మళ్లీ వింత వ్యాధి కలకలం రేపింది. అంతుచిక్కని వ్యాధి కొవ్వలి గ్రామానికీ విస్తరించింది. దీంతో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తమయ్యింది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే కోఠారు అబ్బయ్యచౌదరి గ్రామంలో మంగళవారం పర్యటించారు. ప్రజలెవరూ భయాందోళన చెందనవసరం లేదన్నారు. కాగా, జిల్లాలో అంతు చిక్కని వింత వ్యాధి పట్ల ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొన్ని రోజులుగా  కొమరవోలు, పూళ్లలో విస్తరించిన అంతుచిక్కని వ్యాధిపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడంతో  వ్యాధి ప్రభావం పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది. చదవండి: నేనే శివుడిని.. నాకు ఏ టెస్టు వద్దు: పద్మజ

వింత వ్యాధికి గురై డిశార్జ్‌ అయిన రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయం, వారు తీసుకుంటున్న ఆహార పానీయాలపై కూడా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇంటింటికి సర్వే కొనసాగుతుంది. ప్రజలు ఎవరు ఎక్కడా కూడా భయపడాల్సిన పరిస్థితి లేదని ఎక్కడైనా వింత వ్యాధి లక్షణాలు ఉంటే వారికి పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టింది. చదవండి: ఉద్యోగాల పేరిట మోసం 

మరిన్ని వార్తలు