ఆ కల నెరవేరే రోజు వచ్చింది: తమ్మినేని

24 Oct, 2020 17:48 IST|Sakshi

సాక్షి, బుర్జ(శ్రీకాకుళం): మండలంలోని పలు గ్రామాలు పర్యంచిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పలు అభివృద్ధి పనులకు శంకస్థాపన చేశారు. గుత్తావళ్లి గ్రామంలో సుమారు 60 లక్షల నిధులతో పిహెచ్‌సీ కాంపౌండ్‌ గోడకు శంకుస్థాపన చేసి అనంతరం నాడు-నేడు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం పనులను శనివారం పరిశీలించారు. కళపర్తి గ్రామంలో 7.50 లక్షల నిధులతో ఇటీవల నిర్మించిన అంగన్‌వాడి భవనం కూడా ప్రారంభించారు. తరువాత సుమారు 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేందద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన గుత్తావళి సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధిని ఈరోజు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ఈ గ్రామంలో 2 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా 4.77 లక్షలు రూపాయలు సంక్షేమ పథకాల కింద ఈ ఊరుకి కేటాయించామని, జల జీవన మిషన్ ద్వారా ఇంటింటికి కొళాయిల ద్వారా నీరు అందించేందుకు 67 లక్షల రూపాయల నిధులు ఖర్చుచేయనున్నట్టు తెలిపారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ అవినీతి లేని పాలన ప్రజలకు అందిస్తున్నారని, వ్యవస్థలలో పారదర్శకతను తీసుకువచ్చారన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి యువత ఉద్యోగం కోసం కలలు కంటూనే ఉన్నారని, ఇప్పుడు ఆ కల నెరవేరే రోజు వచ్చిందన్నారు. అధికారం ఇవ్వండి ఉద్యోగ సునామీ సృష్టిస్తానని పాదయాత్రలో సీఎం వైఎస్‌ జగన్ అన్నారని, ఇవాళ ఉద్యోగ విప్లవం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. నాయకుడికి ప్రజల్ని ఆదుకోవాలనే సంకల్పం ఉండాలని, అత్యంత శక్తివంతమైన వ్యవస్థ పౌర వ్యవస్థని వాళ్ళ శక్తికి ప్రభుత్వాలే కులాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాడే వాడే నిజమైన నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖండాపు గోవిందరావు, గుమ్మడి రాంబాబు, బెజ్జివరపు రామారావు, సింగపూరపు కోటేశ్వరరావు, బొడ్డేపల్లి నాగరాజు, బోడ్డేపల్లి నారాయణమూర్తి తదితర వైఎస్సార్ సీసీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా