క్రీడాకారులు జాతీయ పతాకంతో సమానం

1 Jul, 2022 04:56 IST|Sakshi
పావురాలను ఎగరేస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, తదితరులు

స్పీకర్‌ తమ్మినేని సీతారాం

రాష్ట్ర సీనియర్స్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం

శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడాకారులు జాతీయ పతాకంతో సమానంగా సరితూగుతారని, వారికి ఎనలేని ఆత్మాభిమానం ఉంటుందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో 9వ ఏపీ రాష్ట్ర సీనియర్స్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌–2022 పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్‌ మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.

ఒలింపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీ ఎం ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ క్రీడాపోటీల నిర్వహణకు ప్రభుత్వాలతోపాటు దాతలు కూడా సహకరిస్తే మరింత విజయవంతం అవుతాయన్నారు. సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కలిదిండి నరసింహరాజు, కన్వీనర్‌ వెంకటరామరాజు, సీఈవో సి.వెంకటేషులు, నిర్వహణ కమిటీ సభ్యులు ఎం.వి.రమణ, హరిధరరావు, లక్ష్మీదేవి, వైఎస్సార్‌సీపీ నాయకుడు చౌదరి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు