ముందు బీసీని..తర్వాతే స్పీకర్‌ను 

27 May, 2022 04:36 IST|Sakshi
వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం

శాసన సభాపతి తమ్మినేని

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): తాను ముందు బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిని అని, ఆ తర్వాతనే స్పీకర్‌నని తమ్మినేని సీతారాం అన్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా.. ఓ బీసీ నాయకుడిగా యాత్రకు సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం 7 రోడ్ల కూడలి వద్ద మంత్రులతో కలిసి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినట్లు తెలిపారు. ప్రజలు తనను ఎన్నుకోవడం వల్లనే ఇవాళ శాసనసభ స్పీకర్‌ని కాగలిగానని, బీసీని అయిన తనను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్‌ స్థానంలో ఉంచారని చెప్పారు. 

మరిన్ని వార్తలు