‘పోలవరం, సుజల స్రవంతితో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం’

25 Jul, 2021 21:09 IST|Sakshi

స్పీకర్‌ తమ్మినేని సీతారాం

సాక్షి, విశాఖపట్నం: సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో​ మాట్లాడుతూ, నవరత్నాలతో అన్నిరంగాల్లో ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. కోవిడ్ నియంత్రణలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్, సుజల స్రవంతి పథకం ద్వారా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం కానుందని తమ్మినేని అన్నారు.

మరిన్ని వార్తలు