Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు

19 Jun, 2022 16:58 IST|Sakshi

సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బాగోతం బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్‌ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఈ అక్రమ నిర్మాణంపై అధికారులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అయితే తాజాగా అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు కూల్చి వేశారు. అయ్యన్న ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. రోజు నీతులు చెప్పే అయ్యన్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మార్వో జయ మాట్లాడుతూ.. మాజీ మంత్రి అయ్యన్న కుటంబం  అక్రమ నిర్మాణాన్ని గుర్తించాము. అక్రమ నిర్మాణంపై నోటిసులు జారీ చేశాము. నిబంధనలు ప్రకారం అక్రమ నిర్మాణాన్ని తొలగించామని అన్నారు. 

చెరువు కాలువకు చెందిన రెండు సెంట్లు స్థలాన్ని ఆక్రమించి అయ్యన్నపాత్రుడు అక్రమ నిర్మాణం చేపట్టారని నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు అన్నారు. రెండు సెంట్లు స్థలంలో నిర్మించిన ఆక్రమణ నిర్మాణాన్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. అయితే అయ్యన్నపాత్రుడు ఇంటిని తొలగించలేదని అన్నారు. అక్రమ నిర్మాణంపై ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు.

చదవండి: (పారిశ్రామిక విప్లవంలో మరో ముందడుగు) 

మరిన్ని వార్తలు