టీడీపీ నేతలతో కుమ్మక్కై..

8 Sep, 2020 11:21 IST|Sakshi

టీడీపీ నేతలతో కుమ్మక్కై ప్రజాధనానికి ఎసరు పెట్టిన అధికారి

వంశధార– బాహుదా ఇంటర్‌ లింకింగ్‌ ప్రాజెక్టు ముసుగులో చేతివాటం 

విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో అప్పటి ఇరిగేషన్‌ ఎస్‌ఈ సురేందర్‌ బాగోతం బట్టబయలు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో భారీ దోపిడీకి బ్రేక్‌   

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికలకు ముందు బాహుదా ఇంటర్‌ లింకింగ్‌ ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చే కూర్చి ప్రజాధనం మింగేద్దామని టీడీపీ నాయకులు వేసిన ప్లాన్‌ ఎట్టకేలకు బట్టబయలైంది. ఈ బాగోతంలో అధికారులతో పాటు అప్పటి వంశధార ఎస్‌ఈ సురేందర్‌ పేరు కూ డా బయటకు రావడం విస్మయం కలిగిస్తోంది. ప్రారంభం కాని ప్రాజెక్టులను రద్దు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో ఫర్వాలేకపోయింది. లేదంటే ఈ ప్రా జెక్టు ముసుగులో వేల కోట్ల రూపాయలను తినేసేవారే. టీడీపీ నేతలను పక్కన పెడితే బాధ్యత గల అధికారిగా పనిచేయాల్సిన గత ఎస్‌ఈ అవినీతిలో భాగస్వామి కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతా కలిపి కుమ్మక్కై దోచేద్దామని ప్రయత్నించినా ఈ ప్రభుత్వం అడ్డుకోగా, అంతకుముందే డీపీఆర్, ఇతరత్రా పేరిట లక్షలాది రూపాయల అక్రమాలకు పాల్పడిన వ్యవహారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో తేలినట్టు సమాచారం. (చదవండి: ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ..)

టీడీపీ హయాంలో దోపిడీకి ప్రణాళిక 
వంశధార ప్రాజెక్టు రెండో దశలో హిరమండలం రిజర్వాయర్‌ నుంచి 110 కిలోమీటర్ల పొడవునా హైలె వల్‌ కెనాల్‌ తవ్వి ఇచ్ఛాపురం సమీపంలోని బాహుదా నదిలోకి వంశధార జలాలను తరలించి రెండు నదులను అనుసంధానం చేయాలని అప్పటి సర్కార్‌ నిర్ణయించింది. వంశధార, బాహుదా నదులు అనుసంధానం చేసి, 75వేల ఎకరా ల ఆయకట్టుకు నీరందించేందుకు రూ.1075 కోట్లతో 2015 లో బాహుదా ఇంటర్‌ లింకింగ్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేశా రు. 2019 ఫిబ్రవరి 11న ఇదే ప్రాజెక్టును 2లక్షల ఎకరాల ఆయకట్టుకు పెంచి రూ.6,326.62కోట్లతో డిజైన్‌ చేసి టెండర్ల నోటిఫికేషన్‌ పిలిచారు. ఇందులో 90వేల ఎకరాలు స్థిరీకరణ కింద, లక్షా 10వేల ఎకరాల కొత్త ఆయకట్టు కింద నిర్దేశించారు. నాలుగేళ్ల కాలంలో లక్షా 25వేల ఎకరాల మేర అ దనపు ఆయకట్టు చూపించి, రూ. 5,251 కోట్ల మేర అదనంగా అంచనా వ్యయం పెంచారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు డిజైన్‌ చేసి, ఫిబ్రవరి 11న టెండర్లు పిలిచారు. అదే నెల 27న ప్రైస్‌బిడ్‌ టెండర్లు తెరిచారు. (చదవండి: ఆ పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే)

వంశధార ప్రాజెక్టు రెండో దశలో హిరమండలం రిజర్వాయర్‌ నుంచి 110 కిలోమీటర్ల పొడవున హైలెవల్‌ కెనాల్‌ తవ్వి ఇచ్ఛాపురం సమీపంలోని బాహుదా నదిలోకి వంశధార జలాలను తరలించి రెండు నదులను అనుసంధానం చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. హిరమండలం రిజర్వాయర్‌ నుంచి తరలించడం ద్వారా ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో 2లక్షల ఎకరాలకు నీరందించాలనేది ప్రాజెక్టు ఉద్దేశం. ఈ కెనాల్‌కు అనుబంధంగా 8.30 టీఎంసీల సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఆ మేరకు ఎన్నికల షెడ్యూల్‌కు ముందు పరిపాలన అనుమతి ఇచ్చే సింది. ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాల్సి ఉండగా చంద్రబాబు ఒత్తిడి మేరకు కేవలం రెండు ప్యాకేజీల కింద నాటి సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ పనులను ఖరారు చేశారు.  

అంచనా వ్యయం పెంచి.. 
నాటి సీఎం చంద్రబాబునాయుడు స్వ యంగా జోక్యం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు డిజైన్‌ దగ్గరి నుంచి టెండర్ల పిలిచే వరకు కథ నడిపించారు. దానికి అప్పట్లో పనిచేసిన బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు సర్కిల్‌ సూపరింటెండెంట్‌ సురేందర్‌రెడ్డిని పావుగా వాడుకున్నా రు. చంద్రబాబు ఒత్తిడి మేరకు కేవలం రెండు ప్యాకేజీల కింద నాటి సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ పనులను ఖరారు చేశారు. 0 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వరకూ కాలువ తవ్వకం, పెద్ద లో గిడి, రంగసాగరం, మల్లివీడు రిజర్వా యర్ల నిర్మాణానికి రూ.1618.24 కోట్లతో, 55 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకూ కాలువ తవ్వకం, ఆళ్లకోలి, హంసరాళి, కంచిలి రిజర్వాయర్ల నిర్మాణ పనులకు రూ. 2,452.85కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించి లంప్సమ్‌– ఓపెన్‌ విధానంలో టెండర్లు పిలిచారు. టెండర్ల నోటిఫికేషన్‌ జారీ చేయకుముందే తన అనుయాయులైన ఇద్దరు కాంట్రాక్టర్లు రెండు ప్యాకేజీలకు షెడ్యూల్‌ దాఖలు చేసేలా ఒక్కొక్కరు ఒక్కో ప్యాకేజీ దక్కించుకునేలా వ్యూహరచన చేసి, ఆ కాంట్రాక్టర్‌కు ఉన్న అర్హతలనే టెండర్లలో నిబంధనలు పొందుపరిచారు. ఇంకేముంది.. అనుకున్నట్టే కుమ్మక్కైన వారికి రూ.1618.24కోట్ల ప్యాకేజీని రూ. 1695.11 కోట్లకు, రూ.2452.85కోట్ల ప్యాకేజీని రూ.2572.06కోట్లకు కట్టబెట్టారు. ఇదంతా వేల కోట్లు కొట్టేసేందుకు వ్యూహాత్మకంగా డిజైన్‌ చేసిన ప్రాజెక్టుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.   

ఇందులో గత ఎస్‌ఈ సురేందర్‌ పాత్ర  
డీపీఆర్‌ పేరుతో రూ.64,20,345 అడ్డగోలుగా ఇచ్చి ప్రభు త్వ ఖజానా ఖాళీ చేశారు. డబుల్‌ చెక్‌ బెంచ్‌మార్క్‌ లెవల్స్‌ చూసి పోల్స్‌ వెయ్యడానికి సాధారణంగా 2శాతం మాత్రమే వెచ్చించాలి కాని 20 శాతం నిధులు వెచ్చించి వృధాగా ఖ ర్చు చేశారు. 120 కిలోమీటర్ల మేర (కొండలు, నదులు, రోడ్లు) వంటి ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలను బట్టి కెనాల్‌ మొత్తం గ్రిడ్‌ లెవల్‌లు తీయాలి, పుస్తకాల్లో రికార్డు చేయాలి. అవేమీ లేకుండా నిధులు కాజేశారన్న వాదనలు ఉన్నాయి. ఎస్‌ఈ, ఈఈగా వ్యవహరించి పుస్తకాల్లో రికార్డు చేయకుండా అందులో పేర్కొన్న సెక్షన్లతో సంబంధం లేకుండా పే మెంట్‌ చేశారు. అన్ని రికార్డులు ఇచ్చిన తర్వాతే 25 శాతం నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా అవేమీ లేకుండా మధ్యలోనే ఆ 25 శాతం నిధులు రిలీజ్‌ చేశారు. క్వాలిటీ కంట్రోల్‌ సరి్టఫికెట్‌ లేకుండా ఒక్క బిల్లు కూడా ఇవ్వకూడదు. కానీ ఎ ల్‌ఎస్‌ 1పార్ట్‌ బిల్లు, 2 అండ్‌ 3 బిల్లులు చేసేశారు. ప్రాథమిక అంచనాలో రూ.1040 కోట్లుగా ఇచ్చి అమాంతంగా ఆ ప్రా జెక్టు రేటును రూ.6342.55కోట్లకి పెంచేసి ఆ నిధుల కోసం పథక రచన చేశారని ఎస్‌ఈపై నిర్వహించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో తేలినట్టు తెలిసింది. 

అంతేకాకుండా కాంట్రాక్టర్‌ నకిలీ బ్యాంకు గ్యారెంటీని ఇవ్వగా, అదేదీ చూడకుండా తీసుకుని కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇచ్చేశారని, ఇలాంటి నకిలీదేదైనా జరిగితే ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉన్నా అవేమీ చేయకుండా కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని తిరిగి ఇచ్చేశారని విచారణలో తేలినట్టు సమాచారం. అంతేకాకుండా వంశధార ట్రిబ్యునల్‌ టీమ్‌ ఖర్చుల పేరుతో ఎలాంటి సాంకేతిక మంజూరు లేకుండా సురేంద్ర ఇష్టం వచ్చిన వ్యక్తులకు ఇచ్చేసి అక్రమాలకు పాల్పడ్డారని తేల్చారు. కార్యాలయంలో కేస్‌ వర్కర్లు అంటే సూపరింటెండెండ్, జేఈ, ఏఈ, ఈఈలతో సంబంధం లేకుండా ఎస్టిమేట్‌ల మీద ఎస్‌ఈ సంతకాలతోనే ఫైల్‌ రన్‌ చేసేశారని విచారణలో తేలినట్టు సమాచారం.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు