మేమింతే.. ఆంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని టీడీపీ నాయకులు

29 Jun, 2022 13:23 IST|Sakshi
అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా ముందుకు సాగుతున్న టీడీపీ నాయకులు

సాక్షి,చిలమత్తూరు(శ్రీ సత్యసాయి ):  ఆపద సమయంలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు ఎవరైనా సహకరిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా టీడీపీ నాయకులు వ్యవహరించారు. బీమా సొమ్ము పడలేదంటూ చిలమత్తూరులో మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు వెడల్పునా పార్టీ కార్యకర్తలు ముందుకు సాగారు.

అదే సమయంలో ఆపదలో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తూ 108 అంబులెన్స్‌ అటుగా వచ్చింది. అంబులెన్స్‌ డ్రైవర్‌ సైరన్‌ మోగిస్తున్నా.. తమకేమీ పట్టనట్లు కనీసం దారి కూడా ఇవ్వకుండా టీడీపీ నాయకులు వ్యవరించారు. దీన్ని చూసిన స్థానికులు టీడీపీ నాయకుల తీరును ఏవగించుకున్నారు.

చదవండి: లంచం అడిగి అడ్డంగా దొరికాడు.. ఇంటికి వెళ్లి వస్తాను సార్‌ వదలండి!

మరిన్ని వార్తలు