మాల్దీవులకు టీడీపీ నేత పట్టాభి..!?

25 Oct, 2021 17:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లి.. బెయిల్‌ మీద విడుదలైన టీడీపీ నేత పట్టాభి మాల్దీవులకు వెళ్లినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ.. పట్టాభి విమానంలో కూర్చుని ఉన్న ఫోటోలు, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న చిత్రాలు వైరలవుతున్నాయి.
చదవండి: చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: సజ్జల

హైదరాబాద్‌ నుంచి పట్టాభి మాల్దీవ్స్‌ వెళ్లినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పట్టాభి ఎక్కడ అనే చర్చ జోరుగా సాగుతుంది. దేశం వదిలి పారిపోతున్న పట్టాభి అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరలవుతున్నాయి. సీఎం జగన్‌ను బూతులు తిట్టిన కేసులో పట్టాభి అరెస్టయిన సంగతి తెలిసిందే. పట్టాభి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జనాగ్రహ దీక్షలు చేపట్టారు.

చదవండి: ప్రజాస్వామ్యంపై యుద్ధ ప్రకటన

మరిన్ని వార్తలు