టీడీపీ నేత యనమల కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు

28 Apr, 2022 20:38 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: తుని నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన టీడీపీ నేత యనమల కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఓ సభలో టీడీపీ కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే జగనన్న ఇళ్ల పట్టాల లబ్ధిదారుల లిస్ట్‌ రద్దుచేస్తామని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలందరికీ 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అవసరమైతే ఒక్కొక్కరికి మూడేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. కాగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు కృష్ణుడు సోదరుడి వరుస అవుతారు.

‘ఈ లిస్టులు ఉంటాయి అనుకుంటున్నారు వీళ్లు.. గవర్నమెంట్‌ రాగానే అయి తీసి పడేసి మన లిస్టులు ఇస్తాం. మన లిస్ట్‌ పెట్టి రెండేసి సెంట్లు చేసి ఫస్ట్‌ లిస్ట్‌ పెడతాం. అబ్బాయి మీ లిస్ట్‌ క్యాన్సిల్‌ అయిపోయింది. ఇదిగో మా లిస్ట్‌ పంచి పెట్టండి అని చంద్రబాబు నాయుడుని తిట్టారు కూడా ఒక్కోరు. ఇంతకముందు మనది కూడా తప్పుంది. ఎందుకంటే ధర్మంగా చెయ్యాలి అని చేశాం. ధర్మం ఇక పనిచేయదు.
చదవండి👉 తుమ్మపూడిలో ఉద్రిక్తత.. లోకేష్‌ రాకతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు

రెండు సెంట్లే కాదు.. రెండేసి పేర్లు పెడతామో, మూడేసి పేర్లు పెడతామో మీకే తెలీదు. రాబోయే రోజుల్లో మాత్రం చాలా గొప్పగా చేసాడ్రా కృష్ణాగారు అనే టైపు తీసుకొచ్చాను చూడండి అని చెప్పుకోవాలి. తునిలో నేను గెలిచాను.. మోజారీటీ కోసం పోరాడుతున్నాను. అక్కడ చంద్రబాబు అధికార పార్టీకి సీట్లు రాకుండా పోరాడుతున్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు..కృష్ణుడు వచ్చేశారని ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయండి’ అంటూ యనమల కృష్ణుడు కార్యకర్తలతో మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి👉 టెన్త్‌ పరీక్ష పేపర్ల లీకేజీపై మంత్రి బొత్స క్లారిటీ

మరిన్ని వార్తలు