తుదిదశ పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ దాష్టీకం

22 Feb, 2021 06:32 IST|Sakshi
గాయపడిన ఫకీరయ్య

వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య

గుంటూరు జిల్లాలో పోలింగ్‌ ఏజెంట్లపై దాడి

దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం

వైఎస్సార్‌ సీపీ అభిమానుల్ని కవ్వించిన వైనం

దాడులు, ఇళ్లల్లో సామగ్రి ధ్వంసం

పలు జిల్లాల్లో ఘర్షణ

సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో చవిచూసిన ఘోర పరాజయం.. నాలుగో విడత ఎన్నికల్లోనూ ఓటమి తప్ప దని తెలియడం.. వెరసి పల్లెపోరు తుదిదశలోను ఆదివారం టీడీపీ మద్దతుదారులు చెలరేగిపోయారు. కుట్రలకు తెరతీసి వీరంగం వేశారు. ఓవైపు పోలింగ్‌ ప్రక్రియకు విఘాతం కలిగించడంతో పాటు మరోవైపు శాంతిభద్రతల సమస్యలు తలె త్తేలా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబ డ్డారు. తమకు ఓటు వేయకపోతే అంతుచూస్తా మంటూ ఎస్సీ, ఎస్టీ ఓటర్లను బెదిరించడంతోపాటు దాడులు చేశారు. మొదటి మూడు విడతల పోలింగ్‌లో ఓటమికి ప్రతిగా దాడులు కొనసాగి స్తున్నారు. వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను హత్యచేశారు. గుంటూరు జిల్లాలో దళితులపై దాడిచేశారు. ప్రకాశం జిల్లాలో మహిళ మీద దాడిచేసి ఇంట్లో సామగ్రి ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండిళ్లపై దాడిచేసి, మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు.

పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లపైనా దాడి
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం ఐదో వార్డు ఏజెంట్‌ అన్నవరపు బాబురావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబురావును ఆస్పత్రికి తరలించారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బాబురావు కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల ఎస్సీ కాలనీలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధుడు నడవలేకపోవడంతో వైఎస్సార్‌సీపీ అభిమాన అభ్యర్థి తరఫున ఏజెంట్‌గా ఉన్న ఫకీరయ్య సాయం చేశారు. దీన్ని తప్పుబట్టిన టీడీపీ మద్దతుదార్ల ఏజెంట్లు ఫకీరయ్యతో వాగ్వాదానికి దిగడమేగాక కుర్చీతో ఆయనపై దాడిచేశారు. దీంతో ఫకీరయ్య వర్గీయులు ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాల మధ్య జరిగిన కుర్చీల దాడిలో ఫకీరయ్య గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఫకీరయ్యను ఆస్పత్రికి తరలించారు.

దొంగ ఓట్లను.. ప్రశ్నించినందుకు..
సత్తెనపల్లి మండలం ఫణిదంలో టీడీపీ వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారం అందడంతో వైఎస్సార్‌సీపీ అభిమానులు పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారితో టీడీపీ వారు వాగ్వాదానికి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య మాటలు పెరగడంతో పోలీసులు లాఠీలు ఉపయోగించి చెదరగొట్టారు. లక్కరాజు గార్లపాడులో పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్లలోపు నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా చేరిన టీడీపీ నాయకులు.. వైఎస్సార్‌సీపీ అభిమానులతో వాగ్వాదానికి దిగారు. పెదకూరపాడు మండలం కంభంపాడు ఎస్సీ కాలనీకి చెందిన దివ్యాంగుడైన ప్రభాకర్‌తో ఆయన బంధువు సురేశ్‌ ఓటు వేయించి తీసుకెళుతుండగా పోలింగ్‌ కేంద్రం బయట ఉన్న టీడీపీ వర్గీయులు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. దీంతో సురేశ్‌ పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ వర్గీయులపై ఫిర్యాదు చేశారు.

ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో రెండువర్గాల వారు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విశాఖ జిల్లా భీమిలి మండలం తాటిచూరు గ్రామంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఎస్‌ఐ ఒక  గ్రామస్తుడిని కొట్టడంతో ఆగ్రహి ంచిన గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అమ రావతి మండలం ఉంగుటూరు పోలింగ్‌ కేంద్రం లోకి టీడీపీ వర్గీయులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశిస్తుండగా వైఎస్సార్‌సీపీ అభిమానులు అడ్డు కున్నారు. రెండువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉంగుటూరు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన 15 మంది చావపాడులో ఓటు వేయడానికి రావడంతో వైఎస్సార్‌సీపీ అభిమానులు అడ్డుకున్నారు.

నాలుగు కుటుంబాలపై దాడి
సత్తెనపల్లి: దళితులు మా చెప్పుచేతల్లో ఉండాలి.. మాకే ఎదురు నిలబడతారా.. ఏమనుకుంటున్నారు.. అంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో నాలుగు దళిత కుటుంబాలపై టీడీపీ వర్గీయులు ఆదివారం రాత్రి దాడిచేశారు. లక్ష్మీపురం పంచాయతీలో వైఎస్సార్‌సీపీ అభిమాని ఆచంట సుబ్బారావు, టీడీపీ మద్దతుదారు వల్లెపల్లి శ్రీనివాసరావు సర్పంచి పదవికి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాసరావు గెలవడంతో టీడీపీ వర్గీయులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రెండు ట్రాక్టర్లతో విజయోత్సవం నిర్వహిస్తూ బాణసంచా కాల్చారు. దళితుల గృహాల వద్దకు రాగానే ‘మాకే ఎదురు నిలబడతారురా.., కులం తక్కువోళ్లు మేము చెప్పినట్టు చేయాలి..’ అంటూ కర్రలతో దాడులకు దిగారు. దీంతో ఎస్సీ కాలనీకి చెందిన నందం వెంకటేశ్వరరావు, నందం సాంబశివరావు, పి.బెంజిమన్, తారా జయమ్మ, కె.సామ్రాజ్యం గాయపడ్డారు. టీడీపీకి చెందిన మేడూరి కన్న, మేడూరి రవి, బొద్దులూరి చంద్రశేఖర్, పంచుమర్తి శ్రీనివాసరావు, బొద్దులూరి శేఖర్, బొత్తులూరి శ్రీను, కొర్లకుంట నరేంద్ర, బొద్దులూరి అశోక్, కనగాల సందీప్, గోగినేని రామకృష్ణ, అల్లంనేని ప్రసాద్, జి.రమేష్, కె.నరేంద్ర, బి.శ్రీను, మరో పదిమంది కర్రలు, రాళ్లతో దాడిచేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఓడిపోయామని దాడి..
సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఆదివారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభిమాని తిప్పిరెడ్డి వెంకటరెడ్డి.. టీడీపీ మద్దతుదారుడు కె.సాంబయ్యపై 353 ఓట్ల మెజార్టీతో సర్పంచిగా ఎన్నికయ్యారు. అనంతరం వైఎస్సార్‌సీపీ అభిమానులు గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేస్తుండగా.. ఓటమి పాలైన సాంబయ్య తాలూకు కొందరు రాళ్లు రువ్వి ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్‌సీపీ అభిమాని కె.నర్సిరెడ్డి గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో వచ్చిన సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య

ఎన్నికల్లో రాజీచేస్తావా.. అంటూ చంపేసిన టీడీపీ వర్గీయులు
వైఎస్సార్‌ జిల్లాలో దారుణం

బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం మండ లం ముడుమాల గ్రామంలో టీడీపీ వర్గీయులు ఆదివారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త ముడుమాల భాస్కర్‌రెడ్డి (52)ని దారుణంగా హత్యచేశారు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల కథనం మేరకు.. ముడుమాల, పలుగురాళ్లపల్లె పంచా యతీల సర్పంచులుగా వైఎస్సార్‌సీపీ అభిమా నులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని జీర్ణించుకో లేని పలు గురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు  మీసాల దుగ్గిరెడ్డి, ఆయన అనుచరులు ఆదివారం ముడుమాల, జౌకుపల్లె గ్రామాల మధ్యలో భాస్కర్‌రెడ్డితో ఘర్షణకు దిగారు. ‘నువ్వు రాజీచేస్తావా..’ అం టూ ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టారు. భాస్క ర్‌రెడ్డి కుప్పకూలిపోవడంతో వారు పారిపో యారు. ఈ విషయం తెలిసి భాస్కర్‌రెడ్డి కుటుం బసభ్యులు అక్కడికి చేరుకుని 108 వాహనంలో అతడిని బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బ్రహ్మంగారిమఠం పోలీసులు.. హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

హత్యకుగురైన  భాస్కర్‌రెడ్డి

గుడిసెకు నిప్పు.. మొక్కజొన్న తోట ధ్వంసం
కుప్పంరూరల్‌: చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గంలో పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీవారు దారుణంగా ఓడిపోవడంతో తట్టుకోలేని టీడీపీ వారు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేస్తు న్నారు. కుప్పం మండలం గుడ్లనాయనపల్లి పం చాయతీ ఊరునాయునిపల్లెలో శనివారం రెండు ఇళ్ల మీద దాడిచేయడమేగాక గుడిసెకు నిప్పం టించారు. మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. ఈ పంచాయతీ సర్పంచిగా వైఎస్సార్‌ï Üపీ అభిమాని ఝాన్సీరాణి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్ర శేఖర్, పవన్‌కల్యాణ్, చంద్రబాబు, మురుగేష్, లక్ష్మీపతి, కదిరప్ప, మరో ఇద్దరు టీడీపీ వ్యక్తులు వైఎస్సార్‌సీపీ అభిమానులైన బాలాజీ, కృష్ణమూర్తి ఇళ్ల మీద దాడిచేశారు. కృష్ణమూర్తి పొలంలోని గుడిసెకు నిప్పుపెట్టి, మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. భయాందోళనలకు గురైన కృష్ణమూర్తి, బాలాజీ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి దర్యాప్తు చేస్తున్నారు.

అగ్ని ఆహుతైన కృష్ణమూర్తి గుడిసె, ధ్వంసమైన మొక్కజొన్న తోట

మహిళపై దాడి.. ఇంట్లో సామగ్రి ధ్వంసం
పొన్నలూరు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని తిమ్మపాలెంలో ఆదివారం తాను చెప్పిన వారికి ఓటు వేయలేదని ఓ మహిళపై గ్రామ టీడీపీ నాయకుడు దాడిచేశాడు. ఈ విషయమై బాధితురాలు బోడా మధుబాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. ఈనెల 17న జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఆమె తన ఓటు హక్కు వినియోగించుకుంది. ఈ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ అభిమాన అభ్యర్థి విజయం సాధించారు. ఇది జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ వ్యక్తులు రెండు రోజులుగా గ్రామంలో చిన్నచిన్న గొడవలకు దిగారు. ఈ క్రమంలో ఆదివారం బోడా శ్రీను.. వైఎస్సార్‌సీపీ మద్దతదారుడికి ఓటేశావంటు మధుబాలపై దాడిచేశాడు. దుర్భాషలాడుతూ ఆమె ఇంటి ముందు ఉన్న పందిరిని కూలదోసి, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశాడు. శ్రీను నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె కోరారు.

ఇంటిపై దాడిచేసి కూలదోసిన పందిరి

మరిన్ని వార్తలు