ఎస్ఈసీ నిమ్మగడ్డకు టీడీపీ నేతల సన్మానాలు

10 Jan, 2021 17:00 IST|Sakshi

టీడీపీ నేతలా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌..

రాజ్యాంగబద్ద పదవిలో ఉండి టీడీపీ నేతలతో సన్మానాలా?

ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌

సాక్షి, విజయవాడ: రాజ్యాంగ పదవిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ టీడీపీ నేతలా మారిపోయారు. ఆదివారం పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ వేణుగోపాల స్వామిని దర్శించుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు టీడీపీ నేతలు సాదర స్వాగతం పలకడమే కాకుండా, స్వయంగా సన్మానాలు కూడా చేశారు. నిమ్మగడ్డను టీడీపీ నేతలు తాతినేని పూర్ణచంద్రరావు, బుజ్జి కోటేశ్వరరావు, శీలం బాబురావు, సుబ్రహ్మణ్యం, మండవ వీరభద్రరావు, మండవ రవికిరణ్‌, మండవ రాజ్యలక్ష్మి సన్మానించారు. రాజకీయనేతలా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. (చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చంద్రబాబు తొత్తు)

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తీరును వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ తప్పుపట్టారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి టీడీపీ నేతలతో సన్మాలానా? అంటూ మండిపడ్డారు. నిమ్మగడ్డ.. టీడీపీ నేతలా మారిపోయారని.. అందుకు టీడీపీ నేతల సన్మానాలే నిదర్శనమని ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ దుయ్యబట్టారు.(చదవండి: నిమ్మగడ్డ ‘కోడ్‌’ ముందే కూత)

మరిన్ని వార్తలు