విశాఖలో టీడీపీ నేతల భూకబ్జాలు బట్టబయలు

13 Jun, 2021 14:29 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో టీడీపీ నేతల భూకబ్జాలు వెలుగులోకి వస్తున్నాయి.  విశాఖ మహానగరం టీడీపీ నేతల కబ్జా కోరల్లో చిక్కుకుంది. టీడీపీ నేతల చెర నుంచి విశాఖను  ప్రభుత్వం విడిపిస్తోంది. ఇప్పటివరకు రూ.5,080 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని భూకబ్జాదారుల్లో టీడీపీ నేతలే అత్యధికంగా ఉన్నారు.

కబ్జా భూములు చేజారిపోవడంతో టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అక్రమాలు బయటపడటంతో గత కొన్నిరోజులుగా టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెడుతూ బుకాయింపులకు దిగుతున్నారు. టీడీపీ నేత పల్లా శ్రీను ఆక్రమణలో భారీగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆక్రమణల తొలగింపుపై విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల భూకబ్జాపై ఉక్కుపాదం మోపాలని విశాఖ వాసులు కోరుతున్నారు.

చదవండి: చంద్రబాబు హయాంలో భారీగా భూకబ్జాలు: అవంతి
Palla Srinivasa Rao: కబ్జాచేసి.. లీజుకిచ్చి

మరిన్ని వార్తలు