నంది విగ్రహం కేసు: విచారణకు అచ్చెన్నాయుడు

28 Jan, 2021 15:52 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : పలాసలోని సంతబొమ్మాళి పాలేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం తరలింపు కేసులో డీఎస్పీ విచారణకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ముందుగా టీడీపీ కార్యాలయానికి వెళ్లిన అచ్చెన్నాయుడు ఆ తరువాత కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. కాశిబుగ్గ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ శివరామిరెడ్డి అచ్చెన్నాయుడిని విచారిస్తున్నారు. అచ్చెన్నాయుడికి మద్ధతుగా టీడీపీ శ్రేణులు భారీగా తరలి రావడంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తాము కూడా స్టేషన్‌‌లోకి వెళ్తామంటూ పోలీసు అధికారులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. తన వెంట ఎవరూ రావొద్దని.. ఏదైనా జరిగితే రమ్మని టీడీపీ నేతలను అచ్చెన్నాయుడు కోరారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై పోలీసుల విచారణ పూర్తి అయ్యింది. కాశిబుగ్గ పోలీసు స్టేషన్‌లో కొద్దిసేపు అచ్చెన్నాయును డీఎస్పీ శివరామిరెడ్డి విచారించారు. సంతబొమ్మాళి పాలేశ్వర స్వామీ నంది విగ్రహం తరలింపు కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలపై అచ్చెన్నాయుడిని పోలీసులు విచారించగా.. కాశిబుగ్గ పోలీసు స్టేషన్‌ నుంచి తిరిగి పలాస టీడీపీ కార్యాలయానికి ఆయన వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు