సీఐడీ ఆఫీస్‌ వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ఓవర్‌ యాక్షన్‌

3 Nov, 2022 10:47 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సీఐడీ ఆఫీస్‌ వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఓవర్‌ యాక్షన్‌ చేశారు. పోలీసులతో వెలగపూడి వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. అయ్యన్నను ఎందుకు అరెస్టు చేశారో సమాధానం చెప్పాలంటూ పోలీసులతో గొడవకు దిగారు. పోలీసులపైకి దూసుకెళ్లారు. దీంతో వెలగపూడి రామకృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాగా, ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు తొలగించే సమయంలో అధికారులకు అయ్యన్న కుటుంబ సభ్యులు తప్పుడు పత్రాలు సమర్పించారు. అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించిన తప్పుడు పత్రాలపై ఇరిగేషన్ అధికారులు.. సీఐడీకి ఫిర్యాదు చేశారు.
చదవండి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌

మరిన్ని వార్తలు