Chandrababu Tour Boat Accident: చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి

21 Jul, 2022 19:04 IST|Sakshi

సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమ జిల్లా చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. రాజోలు మండలం సోంపల్లి దగ్గర బోటు దిగుతుండగా బరువు ఎక్కువై  నీటిలో బోల్తా కొట్టింది. దీంతో బోటులో ఉన్న టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు.. అందర్నీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
చదవండి: పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్‌

లైఫ్‌ జాకెట్లు లేకుండా..
అధికారులు చెప్పినా టీడీపీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. లైఫ్‌ జాకెట్లు లేకుండా బోటులో ప్రయాణించారు. చంద్రబాబుతో సహా సేఫ్టీ చర్యలను టీడీపీ నేతలు పాటించలేదు. దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ,రాధాకృష్ణ, అంగర రామ్మోహన్‌, మంతెన రామరాజు నీటిలో పడిపోయారు.

మరిన్ని వార్తలు