బీజేపీలో చేరిన టీడీపీ నేత గద్దె బాబూరావు

31 Oct, 2020 13:39 IST|Sakshi

సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పిన విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రభుత్వ విప్‌ గద్దె బాబూరావు శనివారం బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఏపీ సహ ఇంచార్జి సునీల్‌ దేవధర్‌ సమక్షంలో బాబూరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మీడియాతో మట్లాడుతూ... రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీలో చేరాలని పిలుపునిస్తున్నాను. ఎన్టీఆర్ కుమార్తె పురంధ్రేశ్వరికి పార్టీ కేంద్ర కమిటీలో స్థానం కలిపించారు.

చంద్రబాబు ఎవ్వరినైనా వాడుకుని వదిలేస్తారు. గత ఎన్నికల్లో తనకు అనుకూలమైన వ్యక్తులకు సీటివ్వలేదని పోత్తును వదులుకున్నటు చంద్రబాబు ప్రకటించాడు. మళ్లీ సాయంత్రమే కాళ్లబేరానికొచ్చాడు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని వాడుకున్నాడు, మోసగించాడు, వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేయగలడు..? నిర్మాణమైన ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా పోషించలేకపోతున్నారు. బీజేపీ జాతీయ పార్టీ. మోడీ ఇజమ్.. ఎన్టీఆర్ విధానాలను ఇప్పుడు బీజేపీ అనుమతిస్తోంది.  (అందుకే పార్టీకి రాజీనామా : గద్దె బాబూరావు)

హుద్ హూద్ సమయంలో కింజరపు అచ్చెన్నాయుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువుల పూడికలో అడ్డగోలుగా దోచేశారు. బాత్రూమ్‌ కట్టడంలో కూడా అవకతవకలకు పాల్పడి ఆ నిధులు కూడా తెలుగు దేశం పార్టీ నాయకుల జోబుల్లోకే వెళ్లాయి. చంద్రబాబు సొంత మండలంలో కూడా నిర్మాణాలు చేపట్టకుండానే నిధులన్నీ దోచేశారు. గతంలో చినరాజప్పకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినా మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా చేశారు అని సోమువీర్రాజు విమర్శలు గుప్పించారు.  (లక్ష్మీపతిరాజాపై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ)

మరిన్ని వార్తలు