టార్గెటా?.. ఆ జీవో టీడీపీకి, ఎల్లో మీడియాకి అర్థం కాలేదేమో!

4 Jan, 2023 13:21 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ విడుదల చేసిన జీవో నెంబర్‌ 1పై టీడీపీ, ఎల్లోమీడియా వక్రభాష్యం చూపిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాల సభల నిషేధానికంటూ దుష్ప్రచారం నిర్వహిస్తోంది. జీవోలో స్పష్టంగా మార్గదర్శకాలు పేర్కొన్నప్పటికీ.. ప్రభుత్వాన్ని బద్నాం చేసే రీతిలో రాతలను ఎల్లోమీడియా ద్వారా ప్రొత్సహిస్తోంది టీడీపీ. ఇంతకీ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసిన మార్గదర్శకాలను ఓసార పరిశీలిస్తే.. 

ఏపీ ప్రభుత్వం తరపున హోం శాఖ విడుదల చేసిన జీవో నెంబర్‌ 1.. ప్రజల భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలు సూచించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై సభల నిర్వహణతో ప్రజలకు ఇబ్బందులు ఉంటాయని అందులో పేర్కొంది. హైవేలపైనా సభలకు అనుమతులు ఇవ్వరాదని స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం. అంతేకాదు.. ప్రజలకు ఇబ్బందుల్లేని పబ్లిక్‌ గ్రౌండ్స్‌లో, ప్రత్యామ్నాయ ప్రైవేట్‌ స్థలాల్లో సభలను నిర్వహించుకోవాలని సూచించింది. మున్సిపల్‌, పంచాయతీ రోడ్లు మరింత ఇరుకుగా ఉన్నందున.. పబ్లిక్‌ మీటింగ్స్‌ శ్రేయస్కరం కాదని పేర్కొంది ప్రభుత్వం. ఇరుకు రోడ్లలో సభలతో ప్రజనలకు హానికరమని స్పష్టం చేసింది.

ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో లిఖితపూర్వక కారణాలు తెలియజేసే దరఖాస్తులు పరిశీలించాలని ఆదేశం జారీ చేసింది కూడా. రోడ్డు వెడల్పు, మీటింగ్‌ సమయం, స్థలం, ఎగ్జిట్‌ పాయింట్స్‌, ఆ సభలకు హాజరయ్యే జనాభా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది ప్రభుత్వం. సభలు పెట్టేవారికి పోలీసులు ప్రత్యామ్నాయ ప్రదేశాలు సూచించాలని కూడా ప్రభుత్వం ప్రస్తావించింది ఆ మార్గదర్శకాల్లో. ప్రజల భద్రత, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని, జిల్లా పోలీస్‌ యంత్రాంగం సభలకు అవసరమైన స్థలాలు గుర్తించాలని ఆదేశాల్లో పేర్కొంది.

ట్రాఫిక్‌, ప్రజల రాకపోకలు, ఎమర్జెన్సీ సేవలు.. నిత్యావసరాల రవాణాకు ఇబ్బంది లేకుండా గుర్తించాలని ఆదేశించింది. స్పష్టంగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చినా దుష్టచతుష్టయం దుష్ప్రచారం నిర్వహిస్తోంది. సభలు, ర్యాలీలు మొత్తానికే నిషేధించారంటూ వక్రభాష్యం చెప్తోంది.

మరిన్ని వార్తలు