ఉపాధ్యాయ సంఘాలతో భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే?

18 Aug, 2022 19:46 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఫేస్‌ రికగ్నేషన్‌ యాప్‌పై ప్రభుత్వం ఒక విధానం తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం.. మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాలు భేటీ అయ్యాయి. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాలసీ, స్కూళ్లలో నూతన విధానాలపై వివరణ ఇచ్చారు.
చదవండి: మీరు తింటున్న చికెన్‌ బిర్యానీలో ఏముందో తెలుసా?.. భయంకర వాస్తవాలు

అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇది త్వరలో అమలవుతుందన్నారు. తొలుత ఉపాధ్యాయులకు అమలు‌ చేయాలని చెప్పామని, సమన్వయ లోపం‌ వల్ల దీని పై కొంత గందరగోళం ఏర్పడిందన్నారు. ఉపాధ్యాయుల సందేహాలకు సమాధానం ఇచ్చామని, నెలాఖరు నాటికి అందరూ అవగాహన పెంచుకోవాలని చెప్పామన్నారు.

ఇప్పటికే లక్షా 90 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. నిమిషం ఆలస్యమైన ఎవరికీ మేము మెమో ఇవ్వలేదు. ఫేస్‌ రికగ్నేషన్‌  ప్రభుత్వ నిబంధనల్లో ఎప్పటి నుంచో ఉంది. 3 సార్లు దాటి నాలుగోసారి ఆలస్యంగా వస్తే హాఫ్‌ డే లీవ్‌. ఉద్యోగ రీత్యా ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటాం. ఏమైనా లోటుపాట్లు ఉంటే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

మరిన్ని వార్తలు