ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు హాజరైన సీఎం జగన్‌

5 Sep, 2022 11:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు.  డాక్టర్‌ సర్వే రాధాకృష్ణ విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదేనన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ముఖ్యమంత్రిగా విద్యాశాఖపైనే ఎక్కువ సమీక్షలు చేశానన్నారు. ‘‘ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌. సాన పట్టకపోతే వజ్రమైనా కూడా రాయితోనే సమానం. విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉంది. విద్యార్థుల్లోని ప్రతిభను ఉపాధ్యాయులే వెలికితీస్తారు. నాకు విద్య నేర్పిన గురువులకు రుణపడి ఉంటాను. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అనేక చర్యలు చేపట్టాం. విద్యా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్‌ తరాలకు అవసరమైన అందిస్తున్నాం’’ అని  సీఎం అన్నారు.

ఉపాధ్యాయులకు పురస్కారాలు
రాష్ట్రంలోని 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను సీఎం జగన్‌ ప్రదానం చేసి సత్కరించారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్‌ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు