డ్యూటీ దిగాక రూమ్‌కి రావాలని వేధింపులు

31 Jul, 2020 09:15 IST|Sakshi

మ‌హిళా ఉద్యోగుల‌తో అస‌భ్య ఛాటింగ్..

డ్యూటీ దిగాక రూమ్‌కి వ‌చ్చి వెళ్ల‌మ‌ని ఆదేశాలు

సెల‌వు కావాలంటే కోరిక తీర్చాల్సిందే

లాంగ్ డ్రైవ్ లు, టూరిస్ట్ ప్లేస్ లు తిప్పుతా అని ఎర

కోరిక తీర్చ‌ని వారికి ప్ర‌మోష‌న్ లిస్ట్ లో పేర్లు లేకుండా చేస్తున్నా అని బెదిరింపులు

సాక్షి టీవీకి మొర‌పెట్టుకున్న బాధితులు

సాక్షి, టెక్కలి : మ‌హిళా ఉద్యోగుల ర‌క్ష‌ణకు ఎన్నిక‌ఠిన‌ చ‌ట్టాలు తీసుకువ‌చ్చినా కీచ‌కుల ఆగ‌డాలు ఆగ‌డం లేదు. ముఖ్యంగా దిగువ స్థాయి ఉద్యోగులు ప‌ట్ల లైంగిక వేధింపులు కొన‌సాగుతునే ఉన్నాయి. చ‌ట్టం నుండి త‌ప్పించుకోవ‌చ్చ‌నే బులుపుతోనో, దిగువ స్థాయి ఉద్యోగులు అంటే అలుసో గాని మ‌హిళ ఉద్యోగుల వృత్తి అవ‌స‌రాల‌ను అడ్డంపెట్టుకొని పెట్రేగిపోతున్నారు. తాజాగా శ్రీ‌కాకుళం జిల్లా టెక్క‌లి ఆర్టీసీ డిపోలో కూడా ఓ అధికారి ఈ రకమైన వికృత చర్యకు పాల్పడ్డారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడమే కాకుండా.. తన మాట వినకుంటే ప్రమోషన్‌ లిస్ట్‌లో పేర్లు లేకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఏం చేయాలో తెలియని బాధితులు తమ గోడును సాక్షి టీవీకి మొరపెట్టుకున్నారు.(ఆత్మస్థైర్యంతో కరోనాను జయించాను.. )

వివరాల్లోకి వెళితే.. టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న ఈశ్వరరావు డిపోలోని మ‌హిళల‌ ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారితో అసభ్య చాటింగ్‌లు చేయడమే కాకుండా.. డ్యూటీ దిగాక తన ఆఫీస్‌కు వచ్చి వెళ్లాలని ఆదేశాలు కూడా జారీచేశారు. సెలవు కావాలంటే కోరిక తీర్చాల్సిందేనని పశువులా ప్రవర్తించాడు. వయసుతో సంబంధం లేకుండా తను చెప్పిందే చేయాల్సిందేనని ఒత్తిడికి గురిచేశాడు. తాను చెప్పినదానికి ఒప్పుకుంటే లాంగ్‌ డ్రైవ్‌లు, టూరిస్ట్‌ ప్లేస్‌లు తిప్పుతానని ఎర వేసే ప్రయత్నం చేశాడు. తన కోరిక తీర్చకపోతే ప్రమోషన్‌ లిస్ట్‌లో పేర్లు లేకుండా చేస్తానని బెదిరింపులుకు పాల్పడ్డాడు. అయితే ఈశ్వరరావు వ్యవహారం డైరెక్టర్‌ స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అయినప్పటికీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అతడు మరింత రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే ఈశ్వరరావు వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో మహిళా ఉద్యోగులు ఒక్కక్కొరిగా బయటకు వచ్చి అతడి బండరాన్ని బయటపెట్టారు. ఆ  కీచకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.(విద్యార్థుల అభీష్టమే ఫైనల్)

మరిన్ని వార్తలు