ఆకలి పోరాటం వర్సెస్‌ మందుకై ఆరాటం

6 Jun, 2021 18:50 IST|Sakshi

హైదరాబాద్‌ : కరోనా కల్లోల సమయంలో విభిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. పనులు దొరక్క పస్తులుండే ప్రజలు ఓవైపు ఆకలి కేకలు వేస్తుంటే.. కరోనా నిబంధనలు ఉల్లంఘించి మత్తు కోసం ఆరాటపడుతున్నవారు మరో వైపు ఉంటున్నారు. కరోనా వైరస్‌ ఉధృతి తగ్గించేందుకు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి పట్టెడన్నం కోసం క్యూలైన్లలో అవస్థలు పడే వారు ఓ వైపు ఉంటే... కరోనాను లెక్క చేయక, భౌతిక దూరం పాటించకుండా వైన్స్‌ షాపుల ముందు మందలా పేరుకుపోయేవారు మరికొందరు. 

తిండి కోసం
లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన  ఎంతో మంది దుర్గా ఘాట్ సమీపంలో ఫ్లైఓవర్ కింద ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఆహారం అందించేందుకు ఎవరు వచ్చినా వందల మంది లైన్లలో నిల్చుంటున్నారు. 

కిక్కు కావాల్సిందే
మరోవైపు చైతన్యపేట సమీపంలో మద్యం షాపు ముందు భౌతిక దూరం పాటించకుండా మందలా పోటీలు పడుతున్నారు మందు బాబులు. ఆదివారం కావడంతో కిక్కు కోసం కోవిడ్‌ నిబంధనలు పక్కన పెట్టారు. 

చిత్రాలు: చక్రపాణి
 

మరిన్ని వార్తలు