Evening Top 10 News: తెలుగు తాజా వార్తలు 10

26 Jul, 2022 17:52 IST|Sakshi

1. వాలంటీర్లు బాగా పనిచేశారు.. సీఎం జగన్‌తో వరద బాధితులు
వరద నష్టంపై అంచనాలు పూర్తికాగానే ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందిస్తామని తెలిపారు. గతంలో ఏనాడూ లేని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఆసక్తికర సన్నివేశం.. చంటిబిడ్డకు పెన్నును గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోనసీమలోని లంక గ్రామాల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శిస్తున్న క్రమంలో సీఎం జగన్‌ ఓ 8 నెలల పిల్లవాడిని ఎత్తుకున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. రాజ్యసభలో 19 ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు
రాజ్యసభలో 19 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చ జరపాలని రాజ్యసభ పోడియం ముందు విపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. వెల్‌లోకి దూసుకొచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ‘టీడీపీ హయాంతో పోలిస్తే మేం చేసిన అప్పులు చాలా తక్కువ’
ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించే దురుద్దేశంతో రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం జరుగుతోందన‍్నారు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. వివిధ రాష్ట్రాల అప్పులపై పార్లమెంటులో ప్రశ్న అడిగితే.. అదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాత్రమే అడిగినట్టుగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. అమెరికా ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తోందా?...భయాందోళనలో అధికారులు
అమెరికా ఆర్థిక మాంద్యం వైపు పరుగులు తీస్తోందేమోనని యూఎస్‌ అధికారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.  ఐతే అదేం ఉండదని, భయపడాల్సిన అవసరం లేదంటూ  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భరోసా ఇచ్చారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. జట్టులో కోహ్లి స్థానం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు! వీళ్లంతా అప్పుడేం చేశారు?
‘‘విరాట్‌ కోహ్లి పరుగులు సాధించినపుడు.. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సెంచరీలు బాదినపుడు.. ఇలా ఆడాలి. అలా ఆడాలి అని ఎవరూ చెప్పలేదు కదా! మరి ఇప్పుడు ఎందుకు జట్టులో అతడి స్థానం గురించి ప్రశ్నిస్తున్నారు. అసలు మనలో ఎవరికీ కోహ్లిని క్వశ్చన్‌ చేసే హక్కు లేనేలేదు’’ అని టీమిండియా, చెన్నై సూపర్‌కింగ్స్‌ వెటరన్‌ బ్యాటర్‌ రాబిన్‌ ఊతప్ప అన్నాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు: మేమేమైనా మెషిన్లమా? మొత్తుకుంటున్న నెటిజన్లు
ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి  చివరి తేదీని పొడిగించే ఆలోచన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే నెటిజన్లు మాత్రం గడువునే వెంటనే పొడిగించాలని డిమాండ్ చేశారు. జూలై 31వ  తేదీ లోపు ఫైల్ చేయడం సాధ్యం కాదు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. అందుకే రణ్‌వీర్‌ నూలు పోగు లేకుండా ఫోటో షూట్‌ చేశాడేమో: ఆర్జీవీ
ఓ మ్యాగజైన్ కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటో షూట్‌ చేయించుకున్నాడు. ఈ ఫోటోని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అయింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఆమెకు వంద ముఖాలు! అతడి మరణవార్త విని.. మొదటిసారి..
మేకప్‌ మీద ఉన్న మక్కువతో చేస్తోన్న ఉద్యోగాన్ని సైతం వదిలేసి మంచి ఆర్టిస్ట్‌గా మారింది ప్రియాంక పన్వర్‌. దేశవిదేశాల్లోని ప్రముఖ సెలబ్రెటీల ముఖాన్ని తన ముఖంపై చిత్రించి ఔరా అనిపిస్తోంది. దివికేగిన ఎంతో మంది సెలబ్రెటీలకు సైతం తన మేకప్‌ ద్వారా నివాళులర్పిస్తోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఆటోలో వచ్చి బాలికను కిడ్నాప్ చేసి.. గదిలో బంధించి, 3 నెలలపాటు సామూహిక అత్యాచారం
జార్ఖండ్ బోకారోలో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. 9వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్‌ చేసిన ముగ్గురు కిరాతకులు మూడు నెలలపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జులై 19న బాధితురాలు ఎలాగోలా నిందితుల చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు