Evening Top 10 Telugu News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!

21 Jul, 2022 17:46 IST|Sakshi

1. పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్‌
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి  ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్‌ కోరినట్లు తెలిపిన కేంద్ర గిరిజన సంక్షేమం, జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు.. కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ లేదని, అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని పేర్కొన్నారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. విష ప్రచారం.. బురద జల్లడమే ‘ఈనాడు’ పని..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీలో పాలన కొనసాగుతోందన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ముగిసిన ఎంపీ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్‌లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్‌లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల  809 ఓట్లు. యశ్వంత్‌ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. జో బైడెన్‌కు క్యాన్సరా? పొరపాటున నోరు జారారా లేక నిజమా? వైట్ హౌస్ క్లారిటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు క్యాన్సర్ ఉందని మాట్లాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూసి అమెరికన్లు షాక్‌ అయ్యారు. ఆయన చెప్పింది నిజమా, లేక ఎప్పటిలాగే పొరపాటుగా నోరుజారారా? అని తెగ చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై శ్వేతసౌధం క్లారిటీ ఇచ్చింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. బీజేపీ నేతలకు మమత వార్నింగ్‌.. ‘ఇక్కడకు రావొద్దు రాయల్‌ బెంగాల్ టైగర్ ఉంది’
2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ పార్టీకి మెజారిటీ రాదన్నారు. కోల్‌కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. అరంగేట్రంలోనే అదుర్స్‌! 5 వికెట్లు.. ద్రవిడ్‌ తర్వాత ఆ ఘనత సైనీదే! కానీ..
టీమిండియా పేసర్‌ నవదీప్‌ సైనీ కౌంటీ చాంపియన్‌షిప్‌ ఎంట్రీలోనే అదరగొట్టాడు. కెంట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇం‍గ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా కెంట్‌.. వార్విక్‌షైర్‌తో తలపడుతోంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. పారిశుధ్య కార్మికులకు భారీ డిమాండ్‌..కిటికీ అద్దాలు తుడిస్తే చాలు ఏడాదికి కోటి రూపాయిల జీతం!
శానిటైజేషన్‌ వర్క్‌ర్ల(పారిశుధ్య కార్మికులు)కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో ఆయా కంపెనీలు పోటీ పడి మరి భారీ ఎత్తున జీతాల్ని చెల్లిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర‍్లు, డాక్టర్లకు చెల్లించే జీతం కంటే ఎక్కువగానే ఆఫర్‌ చేస్తున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. Netflix: ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అవుతున్న నయన్‌-విఘ్నేశ్‌ల పెళ్లి వీడియో
నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ షాకిచ్చిందని, వారి పెళ్లి వీడియో స్ట్రీమింగ్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకుందంటూ గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలు. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్‌ తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నయన్‌ దంపతులకు నోటీసులు కూడా ఇచ్చిందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లకు చెక్‌ పెట్టింది నెట్‌ఫ్లిక్స్‌. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఆఫ్రికా నుంచి వచ్చిన భర్త.. ప్రియుడి మోజులో భార్య.. దూరంగా ఉండలేమని..
విశాఖలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం ఓ మహిళ.. భర్తనే చంపేసింది. 18 ఏళ్ల వయసున్న ప్రియుడితో కలిసి కుక్కర్‌తో కొట్టి హత్య చేసింది. విశాఖలోని మధురవాడలో బుడుమూరు మురళి కుటుంబం నివాసం ఉంటుంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు