సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వ నిర్ణయం భేష్‌

11 Apr, 2021 08:24 IST|Sakshi

తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌

సాక్షి, అమరావతి/తెనాలి: మధ్య తరగతి ప్రజలకు సినిమా భారం కాకూడదని టికెట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శనివారం ఓ ప్రకటనలో అభినందించారు. దీన్ని రాజకీయ నిర్ణయంగా పరిగణించడం రాజకీయ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమని తెలిపారు.

ఆహ్వానించదగ్గ పరిణామం: దిలీప్‌రాజా
థియేటర్లలో టికెట్‌ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఆహ్వానించదగిన పరిణామమని, ప్రేక్షకులకు ఎంతో ఊరటనిచ్చే అంశమని ‘మా’ ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్‌రాజా గుంటూరు జిల్లా పెదరావూరులో చెప్పారు.
చదవండి:
ప్రభుత్వ ధరలకే సినిమా టికెట్లు అమ్మాలి
సినిమా: ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయాలు తగవు

మరిన్ని వార్తలు