సంపూర్ణంగా సహకరిస్తాం

2 Sep, 2021 04:41 IST|Sakshi

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి భేటీలో ఇరు రాష్ట్రాలు వెల్లడి

సవరణలపై కేంద్ర జల్‌ శక్తి శాఖ స్పందన ఆధారంగా ముందుకు

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్ర జల్‌ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు సంపూర్ణ సహకారం అందించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. నోటిఫికేషన్‌లో సవరణల ప్రతిపాదనలపై కేంద్ర జల్‌ శక్తి శాఖ స్పందన ఆధారంగా ముందుకెళ్తామని తెలిపాయి. బుధవారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు సమావేశం ముగిశాక... కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ అమలే అజెండాగా కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్, గోదావరి బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ల అధ్యక్షతన బోర్డులు ఉమ్మడిగా సమావేశమయ్యాయి. గెజిట్‌ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌–1, 2, 3 లో పేర్కొన్న ప్రాజెక్టుల వివరాలను తక్షణమే అందజేయాలని రెండు రాష్ట్రాలను కోరాయి.

గతనెల 3న జరిగిన సమన్వయ కమిటీ సమావే శానికి, 9న జరిగిన బోర్డుల ఉమ్మడి సమావేశా నికి గైర్హాజరైన తెలంగాణ అధికారులు ఉమ్మడి  భేటీకి హాజరయ్యారు. కృష్ణానదిపై ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు లను బోర్డులు అధీనంలోకి తీసుకుని, నిర్వహిం చాలని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామ లరావు సూచించారు. ఇతర ప్రాజెక్టుల్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను రోజువారీ సేకరించి.. వాటా కింద లెక్కించాలని ప్రతిపాదించారు. దీనివల్ల బోర్డులపై భారం తగ్గుతుందన్నారు. తెలంగాణ అధికారులు కూడా ఇదేరీతిలో స్పందించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం అన్ని ప్రాజెక్టుల వివరాలు అందజేయాలని, అభ్యంతరాలుంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని బోర్డుల చైర్మన్‌లు సూచించారు.

నోటిఫికేషన్‌లో సవరణలు చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖను కోరినట్లు  రెండు రాష్ట్రాల అధికారులు వివరించారు. కృష్ణా బేసిన్‌లో విద్యుదుత్పత్తి కేంద్రాలపై చర్చించాలని ఏపీ అధికారులు పట్టుబట్టగా.. తెలంగాణ అధికారు లు అభ్యంతరం తెలిపారు. కృష్ణాజలాల తరహా లోనే ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 66 శాతాన్ని ఏపీకి కేటాయించాలని అధికారులు కోరారు. సాగర్‌ కుడికాలువ, టెయిల్‌పాండ్, పులిచింతల విద్యు త్‌ కేంద్రాల్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఏపీకే కేటా యించాలని, సాగర్‌ ఎడమకాలువ విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను దామాషా పద్ధతిలో పంపిణీ చేయాలని ఏపీ అధికారులు కోరారు.

ఈ ప్రతిపాదనలపై తెలంగాణ అధికా రులు అభ్యంతరం తెలిపారు. దీంతో వాటిపై మరో సమావేశంలో చర్చిద్దామని కృష్ణా బోర్డు చైర్మన్‌ సూచించారు. ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలతో సంబంధంలేని ప్రకాశం బ్యారేజీ కాలువల వ్యవస్థను కృష్ణా బోర్డు, ధవళేశ్వరం బ్యారేజీ కాలువల వ్యవస్థను గోదావరి బోర్డు పరిధి నుంచి మినహాయించాలని ఏపీ అధికా రులు కోరారు. రెండురాష్ట్రాల అధికారుల సూచనల మేరకు బోర్డుల పరిధి, స్వరూపాన్ని ఖరారు చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి, నిపుణుడు, సభ్యుడు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర విభాగాల సీఈలు, జెన్‌కో సీఈల నేతృత్వంలో సబ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు