Telugu Trending News Today: అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!

28 Jun, 2022 16:45 IST|Sakshi

1. విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు-నేడు, డిటిజల్‌ లెర్నింగ్‌పై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బైజూస్‌తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్‌ అందించడంపై సీఎం జగన్‌ చర్చించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. డాక్టర్ల నుంచి సిబ్బంది కొరత ఉందనే మాట రాకూడదు: సీఎం జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు–నేడుతో పాటు వైద్య ఆరోగ్యశాఖలో చేపడుతున్న పనుల ప్రగతిని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఢిల్లీకి మారిన మహారాష్ట్ర రాజకీయాలు..
మహారాష్ట్ర రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ హస్తీనా చేరుకున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిషాతో ఫడ్నవీస్‌ భేటీ కానున్నారు. మరోవైపు శివసేన రెబెల్‌ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్‌ షిండే కూడా గౌహతి నుంచి ఢిల్లీ బయల్దేరారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Chandrababu: చంద్రబాబు-మానసిక బలహీనతలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఒక సందర్భంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. ఆయనకు వయసు మీద పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అంతవరకు ఓకే. కానీ.. ఆ కౌంటర్ లో చెప్పినట్లుగా ఆయన బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నారా?.. ఉండడం లేదా? అనే చర్చకు ఆస్కారం ఇస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. Kodali Nani: దత్త పుత్రుడిని, సొంత పుత్రుడిని తుక్కుతుక్కుగా ఓడించాం
పనికిమాలిన 420లు అంతా అ‍మ్మఒడి పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్పొరేట్స్‌ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి మూడేళ్లలోనే రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిన సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. టెట్‌ ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక ప్రకటన
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2022) ఫలితాల విడుదలపై రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఫలితాల్లో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1 న విడుదల చేస్తామని వెల్లడించింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు
వింబుల్డన్ 2022లో ప్రపంచ మూడో ర్యాంకర్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నొవాక్ జకోవిచ్‌కు శుభారంభం లభించింది. తొలి రౌండ్‌లో దక్షిణ కొరియా ఆటగాడు, ప్రపంచ 81వ ర్యాంకర్‌ సూన్‌వూ క్వాన్‌పై 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించిన జకో.. రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో జకో ఓ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఎలాంటి ఆఫర్స్‌ రాలేదు
దక్షిణాదిలో ప్రస్తుతం పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దక్షిణాది స్టార్‌ హీరోలదరి సరసన నటించి అగ్ర హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు, పాన్‌ ఇండియా చిత్రాలతో ఆమె కెరీర్‌లో దూసుకుపోతుంది. అయితే ఇటీవల ఆమె నటించిన రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌లు నిరాశ పరిచిన పూజ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. బ్లింకిట్‌ డీల్‌: జొమాటోలో వేల కోట్ల రూపాయలు హాంఫట్‌
ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటోకు భారీ షాక్‌ తగిలింది. కిరాణా డెలివరీ స్టార్టప్ బ్లింకిట్‌ను కొనుగోలు  ఒప్పందం  ప్రకటించిన  తరువాత దాదాపు ఒ‍క బిలియన్  డాలర్ల మేర కోల్పోయింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ భారీ నష్టాన్న చవి చూసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ధరణి పోర్టల్‌ ట్యాంపరింగ్‌.. మీసేవ ఆపరేటర్ల హస్తం!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, అక‍్రమార్కులు ధరణి పోర్టల్‌ను ట్యాంపరింగ్‌ చేశారు. పాసు పుస్తకం ఉన్నప్పటికీ పెండింగ్‌ మ్యుటేషన్‌గా మార్పులు చేసినట్టు తెలుస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు