Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

21 Sep, 2022 17:55 IST|Sakshi

1. కరవు, బాబు ఇద్దరూ కవలలు: సీఎం జగన్‌
ఆర్బీకేలతో వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అలాంటివాళ్లు సభకు రావడం దురదృష్టకరం: ఏపీ స్పీకర్‌
పోడియంపైకి వచ్చి విపక్ష ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం బాధాకరమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. అలాంటివాళ్లు సభకు రావడం దురదృష్టకరమన్నారు. అరాచకం సృష్టించేవాళ్లను చూస్తే బాధగా ఉందన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. దసరా సెలవులు కుదింపు వాస్తవమేనా?.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ
దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని.. సెలవుల కుదింపుపై వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ ఖండిచింది. కుదింపుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Chiranjeevi: ఏపీసీసీ డెలిగేట్‌గా మెగాస్టార్‌ చిరంజీవి
మెగాస్టార్‌ చిరంజీవి ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కాంగ్రెస్‌ పార్టీ కొత్త గుర్తింపు కార్డును జారీ చేసింది. కొవ్వూరు నుంచి చిరంజీవి పీసీసీ డెలిగేట్‌గా ఉన్నారు. 2027వరకు చిరంజీవిని పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం కొత్త ఐడీ కార్డు మంజూరు చేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. పార్టీ చాలా ఇచ్చింది.. ఏం అడిగినా చేసేందుకు రెడీ.. కానీ!
వచ్చే నెలలో జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పోటీ చేస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఉక్రెయిన్‌ని నివారించేలా రష్యా ఎత్తుగడ.. పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌
గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌ దళాలు రష్యా బలగాలపై పైచేయి సాధిస్తూ...రష్యా ఆక్రమిత ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో రష్యా అధ్యక్షుడు బహిరంగంగా మరిన్ని సైనిక సమీకరణలను చేయనున్నట్లు ప్రకటించారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Hurun India Rich List 2022: అదానీ రోజు సంపాదన ఎంతో తెలుసా?
కరోనా మహమ్మారి సంక్షోభం తరువాత  సంపదలో  భారతీయ కుబేరులు గ్లోబల్‌ బిలియనీర్లను దాటి ట్రిలియనీర్లుగా దూసుకు పోతున్నారు. దేశంలో 12 మంది అపర కుబేరుల నికర విలువ రూ. ఒక ట్రిలియన్ కంటే ఎక్కువేనని తాజా నివేదిక తేల్చింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Ind Vs Aus 1st T20: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బాబర్‌ను వెనక్కినెట్టిన సూర్య.. కోహ్లి మాత్రం!
ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అదరగొట్టాడు. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను అధిగమించి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ సినిమాకు బ్రేక్‌! అసలు కారణమిదేనా?
సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు-స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తు‍న్న ఈ మూవీని హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. హోటల్‌ రూమ్‌లో లవర్‌తో భర్త రాసలీలలు.. భార్య ఎంట్రీతో సీన్‌ రివర్స్‌!
వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారుకిడుస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఇలాంటి క్రమంలో కుటుంబ సభ్యులకు దొరికిపోయి సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు