Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

23 Sep, 2022 18:02 IST|Sakshi

1. చంద్రబాబు కుప్పం నుంచి కావాల్సింది తీసుకున్నాడు.. చేసిందేం లేదు: సీఎం జగన్‌
నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నాడని, అలాంటి వ్యక్తి కుప్పం నుంచి తనకు కావాల్సింది తీసుకున్నాడే తప్ప.. చేసిందేమీ లేదని సీఎం జగన్‌ చాటిచెప్పారు. కుప్పం అనిమిగానిపల్లి బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అవ్వా, తాతలకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌.. కీలక ప్రకటన
కుప్పం వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. కుప్పం అనిమిగానిపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న రూ.2500 పెన్షన్‌ను  ఈ జనవరి నుంచి రూ.2,750లకు పెంచుతున్నామని ప్రకటించారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. సిగరెట్‌ వేరు.. మద్యం వేరు.. అందుకు నో చెప్పిన సుప్రీంకోర్టు
దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, వినియోగంపై నియంత్రణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ వేశారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. బీజేపీకి వెన్నుపోటు పొడిచి ప్రధాని కాగలరా? నితీశ్‌పై అమిత్‌షా ధ్వజం
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024లో ప్రధాని కావాలనే లక్ష‍్యంతో ఆయన బీజేపీకి వెన్నుపోటు పొడిచి లాలూ ప్రసాద్ యాదవ్ ఒళ్లో కూర్చున్నారని ధ్వజమెత్తారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. నువ్వా నేనా.. అనంత అసెంబ్లీ టికెట్‌ దక్కేదెవరికో..?.. జేసీ ఎత్తులకు ప్రభాకర్‌ చెక్‌ పెడ్తాడా?
అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. పెండింగ్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తులు.. ఎందుకిలా?
దేవుడు వరం ఇచ్చినా... పూజారి కరుణించని చందంగా తయారైంది షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల పరిస్థితి. ఉన్నతాధికారుల ఉదాసీనవైఖరితో నిరుపేద ఆడబిడ్డల ఆర్థిక చేయూతకు గ్రహణం పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. గ్లోబల్‌ మాంద్యం భయాలు: 5 లక్షల కోట్లు ఢమాల్‌
బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్‌మాంద్యం, ముఖ్యంగా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డింపుతో దేశీయ స్టాక్‌మార్కెట్‌ భారీ పతనాన్ని నమోదు చేసింది. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రికార్డు కనిష్టానికి చేరింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. IPL 2023: ఐపీఎల్‌ మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
ఐపీఎల్‌-2023 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ, ఐపీఎల్‌ నిర్హహకాకులు ఆయా ఫ్రాంచైజీలకు సమాచారం కూడా అందించినట్లు తెలస్తోంది. కాగా ఈ మినీ వేలం దాదాపు డిసెంబర్‌ 16న జరిగే అవకాశం ఉంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. Chhello Show: ఆ నిర్ణయం సరైంది కాదు.. పునరాలోచించండి.. సినిమా చూడకుండానే..!
అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో'. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆస్కార్ వేడుకల్లో 'బెస్ట్‌ ఇంటర్నేషనల్ ఫీచర్‌ ఫిల్మ్'( ఉత్తమ అంతర్జాతీయ చిత్రం) విభాగంలో పోటీకి ఎంపికైంది ఈ చిత్రం.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్‌ చేయలేకపోతున్నారా? ఇవి తింటే..
హై బీపీ.. హెవీ బ్లడ్‌ ప్రెషర్‌.. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అధిక రక్తపోటును నిశ్శబ్ద కిల్లర్‌గా సూచిస్తారు. ఇది తరచుగా ఎలాంటి సంకేతాలు, హెచ్చరికలు, లక్షణాలు లేకుండా వస్తుంది కాబట్టి చాలామందికి రక్త పోటు యొక్క ప్రమాద సూచిక అసలు అర్థం కాదు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు