Visakhapatnam: శిలలే వణికినా.. సాగులే జీవనం!

19 Dec, 2021 09:14 IST|Sakshi
మంచులో వెలుగులు

Snowfall In Visakhapatnam In Winter Season: మన్యం అందాలకు పుట్టినిల్లు.. సొగసుల మెట్టినిల్లు..శీతాకాలం వచ్చిందంటే ‘స్నో’గసులు పోతుంది. మంచు తెరలు మనసును మీటుతాయి. వెండిమబ్బుల్లాంటి మేఘాలు నిత్యం హాయ్‌ అంటూ పలకరిస్తాయి. శీతాకాలం సీజన్‌ ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో ముందస్తు భోగి మంటలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా చలి మంటలు స్వాగతం పలుకుతున్నాయి.

చలి తట్టుకోవటం ఎవరికైనా చాలా కష్టం. ఎంతటి వారైనా చలికి గజగజ వణికిపోవల్సిందే.. ఎందుకంటే మన శరీరం 25 నుంచి 35 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది. అంతకన్నా ఉష్ణోగ్రత తగ్గితే శరీరం వణకడం మొదలుపెడుతుంది. విశాఖ మన్యంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 6 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటోంది. అయితే చలిని తట్టుకుని నిత్య జీవనం గిరిజనుల సొంతం. అంతటి చలిలోనూ మన్యం వేకువనే నిద్ర లేస్తోంది. పిల్లలు సైతం గంట కొట్టకముందే పాఠశాలకు చేరుకుంటున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అన్ని వర్గాల వారూ చలిగింతల మధ్య నిత్యజీవనం కొనసాగిస్తున్నారు.               
– పాడేరు

చదవండి: బరితెగింపు: ప్రభుత్వ స్థలం ఆక్రమణ విషయంలో తగ్గేదేలే!

మరిన్ని వార్తలు