టెంపుల్‌ టూరిజంలో ఆలయాల అభివృద్ధి 

17 Sep, 2021 03:24 IST|Sakshi

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు  

సాక్షి, అమరావతి: టెంపుల్‌ టూరిజంలో భాగంగా దేవాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించినట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాదం’ పథకం కింద రూ.48 కోట్లతో అన్నవరం దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే రూ.50 కోట్లతో శ్రీశైల దేవాలయం అభివృద్ధి పనులు పూర్తిచేశామని, మరో రూ.50 కోట్లతో సింహాచల ఆలయ అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా, రాయలసీమ పర్యాటక సర్క్యూట్లలో రవాణా, కమ్యూనికేషన్‌ సౌకర్యాల కల్పనతో పాటు మౌలిక వసతులను మెరుగుపరుస్తామన్నారు. రూ.47 కోట్లతో పర్యాటక సంస్థకు చెందిన 15 హోట్లళ్లు, రెస్టారెంట్లను ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను తీసుకొస్తున్నామన్నారు. పర్యాటక సంస్థకు ఏడాదిలో ఇప్పటికే రూ.40 కోట్ల ఆదాయం వచ్చిందని, రూ.125 కోట్ల వార్షిక ఆదాయం లక్ష్యంతో ముందుకెళుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థ సీఈవో, ఏపీ టూరిజం కార్పొరేషన్‌ ఎండీ ఎస్‌.సత్యనారాయణ పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు