పుష్పగిరిలో కాకతీయులనాటి ఆలయం

1 Mar, 2023 04:58 IST|Sakshi

మైదుకూరు/కడప కల్చరల్‌: పుష్పగిరి క్షేత్రంలో 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి ఆలయం వెలుగు చూసింది. వైఎస్సార్‌ జిల్లాలో దక్షిణ కాశీగా పేరున్న పుష్పగిరిలో వందల ఆలయాలు ఉన్నాయి. కానీ అక్కడ పుష్పాచలేశ్వర ఆలయం ఉన్నట్లు చాలామందికి తెలియదు.

కొండపై ఈశాన్యంలో ఈ ఆలయాన్ని కాకతీయ వాస్తు నిర్మాణ శైలిలో తీర్చిదిద్దారు. గుప్త నిధుల కోసం ధ్వంసం చేయడంతో ఆలయం నేడు శిథిలావస్థకు చేరింది. ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే ప్రస్తుతం తలపెట్టిన గిరి ప్రదక్షిణకు మరింత విశిష్టత చేకూరుతుందని రచయిత, చరిత్రకారుడు తవ్వా ఓబుల్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు