మితిమీరి.. దిగజారి

29 Apr, 2022 15:44 IST|Sakshi
రొట్టవలస పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

సాక్షి,శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు, సర్కారును ఇరకాటంలో నెట్టేందుకు ‘కొందరు’ టెన్త్‌ పరీక్షలను కూడా వాడుకుంటున్నారు. మితిమీరిన ‘స్వామి భక్తి’ చూపడానికి, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు వేల మంది విద్యార్థుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. జిల్లాలో ప్రశ్న పత్రం లీకేజీ అంటూ తప్పుడు బ్రేకింగ్‌ వార్తలు, కథనాలను వండి వార్చేశారు. అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాక అలాంటిదేమీ లేదని తేలింది. దీంతో ఈ ప్రచారం వెనుక ఉన్న వ్యక్తుల ను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కొందరు మీడియా ప్రతినిధులను కూడా విచారిస్తున్నారు.  

జిల్లాలోని సరుబుజ్జిలి మండలం రొట్టవలస, షళంత్రి కేంద్రాల నుంచి గురువారం హిందీ ప్రశ్న పత్రం లీకైందంటూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానెల్‌ ప్రసారం చేసింది. స్క్రోలింగ్‌లను ఇచ్చింది. ఈ వా ర్తలు చూసి విద్యాశాఖాధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే విద్యాశాఖ, సమగ్ర శిక్ష, రెవెన్యూ అధికారులు, పోలీసులు పరీక్ష కేంద్రానికి చేరుకుని దీనిపై ఆరా తీశారు. కలెక్టర్‌కు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేశారు. స్థానిక పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఎవరూ లేరు. పేపర్‌ లీకేజీ అంటూ వస్తున్న కథనాన్ని చూపించి పరీక్ష కేంద్రంలోని పర్యవేక్షణాధికారులను ప్రశ్నించగా, అలాంటి అవకాశమే లేదని బదులిచ్చారు. పోలీసు స్టేషన్ల నుంచి నేరుగా ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తీసు కొచ్చామని, పరీక్షలు మొదలుపెట్టామని, ఇన్విజిలేటర్ల నుంచి సెల్‌ఫోన్లను డిపాజిట్‌ చేసుకున్నామని వివరించారు.  

కావాలనే చేశారు..  
పరిశీలన పూర్తయ్యాక లీకేజీ కట్టుకథేనని అధికారులు తేల్చారు. ఈ వదంతులు పుట్టించిన వారిపై మండిపడ్డారు. అటు విద్యాశాఖను, ఇటు ప్రభుత్వా న్ని అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది వ్యక్తు లు పనిగట్టుకుని చేసిన దుశ్చర్యగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయమై ఆర్జేడీ జ్యోతికుమారి, డీఈఓ పగడాలమ్మ, సమగ్రశిక్ష ఏపీసీ డా క్టర్‌ జయప్రకాష్‌లు మీడియాకు వివరించారు. ప్రశ్న పత్రం లీకేజీ అంటూ తప్పుడు కథనాలు, వార్తను ప్రసారం చేసిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానెల్‌పై, అందుకు సహకరించిన వ్యక్తులపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా రు. ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. క్రిమినల్‌ కేసు లుకూడా నమోదుచేయాలని కలెక్టర్‌ నిర్ణయించారు.    

రెండో రోజు 179 మంది గైర్హాజరు..  
జిల్లాలో గురువారం 248 కేంద్రాల్లో జరిగిన హిందీ పరీక్షకు 36,124 మంది (ఒక విద్యార్థి పెరిగారు) హాజరుకావాల్సి 179 మంది గైర్హాజరయ్యారు. ఆర్జే డీ, జిల్లా పరిశీలకులు ఎం.జ్యోతికుమారి జీహెచ్‌స్కూల్‌ పోలాకి, విశ్వశాంతి స్కూల్‌ పోలాకి, జెడ్పీ జీహెచ్‌ స్కూల్‌ పోలాకి, జెడ్పీహెచ్‌స్కూల్‌ సారవకోట కేంద్రాలను పరిశీలించారు. డీఈఓ జి.పగడాలమ్మ శ్రీకాకుళం, నరసన్నపేట, సరుబుజ్జిలి ప్రాంతాల్లో 5 కేంద్రాల్లో తనిఖీలు చేశారు. సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్‌ రోణంకి జయప్రకాష్, స్క్వాడ్‌ బృందాలు కలిపి 58 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టాయి. 

టెన్త్‌ పరీక్షలో విద్యార్థి డిబార్‌ 
రణస్థలం: రణస్థలం మండలంలోని పైడిభీమవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం హిందీ పరీక్ష రాసిన ఓ విద్యార్థి మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు పరీక్ష కేంద్రం చీఫ్‌ సూ పరింటెండెంట్‌ శంకర శాస్త్రి తెలిపారు. క్వశ్చన్‌ పేపర్‌ను కిటికీలో నుంచి బయట వ్యక్తులకు అందిస్తున్న సమయంలో పహారా కాస్తున్న పోలీసు విద్యార్థిని పట్టుకున్నారు. గోడ దూకి వచ్చిన బయట వ్యక్తి పరారైనట్లు ఆయన తెలి పారు. విద్యార్థి నుంచి పూర్తి వాంగ్మూలం తీసుకుని డిబార్‌ చేసినట్లు తెలిపారు.   

చదవండి: ప్రశ్నపత్రం లీకేజీ అంటూ తప్పుడు ప్రచారం

మరిన్ని వార్తలు