‘ఎన్టీఆర్‌ అభిమానుల తరఫున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు’

27 Jan, 2022 19:04 IST|Sakshi

తాడేపల్లి: ప్రజలకు మంచి పాలన అందించాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని, దానిలో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలు మనసు గెలుచుకున్నారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేలా చర‍్యలు తీసుకున్నారని, గిట్టుబాటు ధర కోసం ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోళ్లు చేపట్టిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదని కొడాలి నాని ప్రశంసించారు.

కొడాలి నాని మాట్లాడుతూ..‘ ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు.  కొత్త జిల్లాల ఏర్పాటు అర్థరాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు.. ఎన్టీఆర్‌ అభిమానుల తరఫున కృతజ్ఞతలు.  ఎన్నికల హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు. పరిపాలన సౌలభ్యం కోసమే 26 జిల్లాలు ఏర్పాటు. అధికార వికేంద్రకరణ కోసమే 3 రాజధానుల నిర్ణయం’ అని కొడాలి నాని పేర్కొన్నారు.  కాగా, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి: కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు.. స్పందించిన పురందేశ్వరి

శ్రీ సిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు